Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈయన వయసు పై బడినటప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ సినిమా సోసియో ఫాంటసీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను శర వేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ త్రిష నటించబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి.
త్రిష చిరంజీవి కాంబినేషన్లో స్టాలిన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తర్వాత మరోసారి వీరిద్దరూ విశ్వంభర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా చిరంజీవి హీరోయిన్ త్రిష ఊహించని గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. త్రిష కోసం చిరంజీవి ఒక మగ్ ఇచ్చారని తెలుస్తుంది.
18 ఏళ్ల తర్వాత..
చిరంజీవి ఇలా మగ్ ఇవ్వడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు అయితే ఈ మగ్ స్పెషలిటీ తెలిస్తే మాత్రం అందరూ షాక్ అవుతున్నారు ఇది త్రిష బాడీ టెంపరేచర్ ను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటుందట. అంతే కాకుండా ఇందులో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయని తెలుస్తోంది. గిఫ్ట్ ఎలాంటిదైనా ఒక లెజెండరీ నటుడి నుంచి తన కోసం ప్రత్యేకంగా గిఫ్ట్ రావడంతో త్రిష సంతోషంలో తేలిపోతూ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…