Movie News

Akash Puri: మా నాన్న డైరెక్షన్లో సినిమాలు చెయ్యను.. లవ్ రిలేషన్ ఫై ఓపెన్ అయిన ఆకాష్ పూరి ?

Akash Puri: తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒకరు. ఈయన ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరూ కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రాలను అందుకున్నటువంటి హీరోలే అని చెప్పాలి.

ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి యంగ్ హీరోలు అందరికీ కూడా పూరి జగన్నాథ్ అద్భుతమైన బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. అయితే ఇటీవల కాలంలో పూరి సినిమాలు కూడా కాస్త ప్రేక్షకులను నిరాశ పరుస్తున్నాయి. ఇక పూరి కుమారుడు ఆకాష్ కూడా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే .ఈయన పలు సినిమాలలో నటించిన ఇప్పటివరకు సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయారు.

ఇకపోతే ఈయన హీరోగా కొనసాగుతూనే మరోవైపు తొలిసారి ఒక బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆకాష్ ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్లాత్ బ్రాండింగ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్రేజీ మెన్స్ క్లాత్ బ్రాండింగ్ గా పేరు తెచ్చుకుంటోంది. ఈ క్లాతింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయడం హ్యాపీగా ఉందని తెలియజేశారు అనంతరం మీడియా సమావేశంలో భాగంగా విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

సింగిల్ గానే ఉన్నాను..
ఈ సందర్భంగా ఓ విలేఖరి ఆకాష్ ను ప్రశ్నిస్తూ మీరు మీ నాన్న డైరెక్షన్లో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ తాను నటుడిగా పూర్తిస్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న తరువాతనే నాన్న డైరెక్షన్లో ఒక పెద్ద సినిమా చేస్తాను అప్పటివరకు నేను నాన్న డైరెక్షన్లో సినిమాలు చేయనని ఈ సందర్భంగా ఈయన క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా లవ్ గురించి ప్రశ్నలు రావడంతో ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నానని తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

22 hours ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

22 hours ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

22 hours ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

22 hours ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

22 hours ago

మీలో దాగి ఉన్న జంతువు ఏది? మీ వ్యక్తిత్వానికి సరిపడేది ఎలా తెలుసుకోవాలి?

ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…

22 hours ago