General News

పెద్ది ప్రమోషన్స్‌లో రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్.. ఒంటరితనం గురించి ఎమోషనల్ మాటలు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుండగా, మూవీ ప్రమోషన్స్ మరింత జోరుగా సాగుతున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్, గ్లింప్స్ సోషల్ మీడియాలో మంచి హైప్ తీసుకురావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

ఈ నేపథ్యంలో రామ్ చరణ్, బుచ్చిబాబు కలిసి చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది. షూటింగ్ సమయంలో ఎదురైన అనుభవాల గురించి మాట్లాడిన చరణ్.. కోవిడ్ కాలంలో తాను తీవ్రంగా మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. ఆ సమయంలో బయట ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు, చుట్టుపక్కల కనిపించిన పరిస్థితులు తనను లోపల నుంచి బాగా ప్రభావితం చేశాయని చెప్పారు.

RRR షూటింగ్ మధ్యలో ఆగిపోవడం కూడా తనపై ప్రభావం చూపిందని చరణ్ గుర్తు చేసుకున్నారు. ఇంట్లోనే ఎక్కువ సమయం గడపాల్సి రావడం, ఒంటరిగా ఉండటం వల్ల తాను పూర్తిగా డల్‌గా మారిపోయానని తెలిపారు. తన భార్య ఉపాసన కొణిదెల ఆస్పత్రి సేవల్లో బిజీగా ఉండగా, తాను ఒక గదిలోనే ఎక్కువ రోజులు గడిపానని చెప్పారు. ఆ సమయంలో మానసికంగా చాలా కుంగిపోయానని వెల్లడించారు.

అలాంటి సమయంలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇచ్చిన సలహా తన జీవితాన్ని మార్చేసిందని చరణ్ అన్నారు. “మోటివేషన్ కోసం పెద్ద కారణాలు అవసరం లేదు. చిన్న చిన్న పనులతో మొదలుపెట్టు. ఉదయం లేచి నీ గది శుభ్రం చేయడం అయినా, గార్డెన్ చూసుకోవడం అయినా ఒక లక్ష్యంగా పెట్టుకో” అని రాజమౌళి చెప్పిన మాటలు తనలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపాయని తెలిపారు.

ఆ చిన్న మార్పులే మళ్లీ తనను సాధారణ స్థితికి తీసుకువచ్చాయని చరణ్ చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా అదే ఆలోచనతో ముందుకు వెళ్తున్నానని, ప్రతి రోజు ఒక చిన్న లక్ష్యంతో జీవితం సాగిస్తే ఒత్తిడి తగ్గుతుందని వివరించారు. ప్రస్తుతం తాను చేస్తున్న ‘పెద్ది’ పాత్రలో కూడా అదే భావన కనిపిస్తుందని తెలిపారు.

ఇక సినిమా గురించి మాట్లాడుతూ, ఈ కథ తనకు చాలా ప్రత్యేకమని చెప్పారు. పాత్ర కోసం ఫిజికల్‌గా, మెంటల్‌గా ఎంతో కష్టపడ్డానని వెల్లడించారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చేలా ఈ సినిమాను తెరకెక్కించారని, బుచ్చిబాబు డెడికేషన్ చూసి తాను కూడా ఆశ్చర్యపోయానన్నారు. విడుదల తర్వాత ‘పెద్ది’ ప్రేక్షకుల అంచనాలను తప్పకుండా అందుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేశారు.

Swathi N

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago