Ram Gopal Varma: దర్శకుడు ఆర్జీవీ ఎప్పుడూ వివాదాలతోనే వార్తల్లో నిలుస్తుంటాడు. అందుకే ఆయన్ని కొందరు విలక్షణ దర్శకుడిగా కాకుండా వివాదాల దర్శకుడిగా పిలుస్తుంటారు. తాజాగా ఆయన అషురెడ్డితో కలిసి ఓ ఇంటర్వ్యూ చేశారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చాలా మంది ఆ వీడియోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆర్టీవీ ఇంతగా దిగజారిపోయాడని, అసలు అషురెడ్డి కాలి వేళ్లను ముద్దాడటం ఏంటని మరికొందరు ఫైర్ అవుతున్నారు.
రామ్ గోపాల్ వర్మ అషురెడ్డి కాలి వేళ్లను ముద్దు పెట్టడం ఇప్పుడు ఆయన అభిమానులకు మింగుడు పడటం లేదు. అందుకే పలువురు నెటిజన్లు ఆర్జీవీ వీడియోపై, ఆర్జీవీ కామెంట్లపై ఫైర్ అవుతున్నారు. దీంతో ఆర్జీవీ స్వయంగా రంగంలోకి దిగారు. అషురెడ్డి కాలి వేళ్లను ముద్దాడటం గురించి మాట్లాడుతూ ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.
తాను షేర్ చేస్తున్న వీడియో ఎవరినీ ఉద్దేశించిది కాదని, ముఖ్యంగా తన సో కాల్డ్ ఫాలోయర్స్ కోసం ఈ వీడియో చేయడం లేదని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. తాను ఏం చేసినా సోషల్ మీడియాలో బిట్లు బిట్లుగా వీడియోలు అప్లోడ్ చేస్తున్నారని, తనపై వికారంగా మీమ్స్ చేస్తున్నారని, అంతేకాకుండా తనపై ఇష్టం వచ్చినట్లు రాసేస్తున్నారని తెలిపాడు. తాను అషురెడ్డితో ఈ ఇంటర్వ్యూ ఎలాంటి అభ్యంతరం లేకుండా చేశానని అన్నాడు.
లైఫ్ లో అందరూ కష్టపడి పని చేస్తారని, ప్రతి ఒక్కరికీ కూడా ఎంటర్టైన్ మెంట్ అనేది కచ్చితంగా అవసరమని ఆర్జీవీ తెలిపారు. అయినా నేను అషు రెడ్డి కాళ్ళు నాకితే మీకేం నొప్పి ? ఎవరి టేస్ట్ కి తగ్గట్టుగా వారు ఏదోక ఎంచుకుంటారని, అవి మీకు ఇష్టం లేకుంటే చూడటం మానేయండని ఆర్టీవీ ఫైర్ అయ్యారు. తన వినోదం తాను ఏదోకటి చేస్తుంటే పనిలేనివాళ్లంతా తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని తెలిపాడు. అషురెడ్డి కాళ్లను ముద్దాడుకోవడం తన ఇష్టమని, నచ్చినవాళ్లు చూడండి.. నచ్చని వాళ్లు చూడకండి.. మీకు వేరే పనులు లేవా? అంటూ ఖరాకండీగా చెప్పేశాడు. రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…