Categories: Featured

Ram Gopal Varma: అషురెడ్డి కాళ్లను ముద్దాడిన వర్మ.. అయితే ఏంటంటూ నెటిజన్లపై ఆర్జీవీ ఫైర్!

Ram Gopal Varma: దర్శకుడు ఆర్జీవీ ఎప్పుడూ వివాదాలతోనే వార్తల్లో నిలుస్తుంటాడు. అందుకే ఆయన్ని కొందరు విలక్షణ దర్శకుడిగా కాకుండా వివాదాల దర్శకుడిగా పిలుస్తుంటారు. తాజాగా ఆయన అషురెడ్డితో కలిసి ఓ ఇంటర్వ్యూ చేశారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చాలా మంది ఆ వీడియోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆర్టీవీ ఇంతగా దిగజారిపోయాడని, అసలు అషురెడ్డి కాలి వేళ్లను ముద్దాడటం ఏంటని మరికొందరు ఫైర్ అవుతున్నారు.

రామ్ గోపాల్ వర్మ అషురెడ్డి కాలి వేళ్లను ముద్దు పెట్టడం ఇప్పుడు ఆయన అభిమానులకు మింగుడు పడటం లేదు. అందుకే పలువురు నెటిజన్లు ఆర్జీవీ వీడియోపై, ఆర్జీవీ కామెంట్లపై ఫైర్ అవుతున్నారు. దీంతో ఆర్జీవీ స్వయంగా రంగంలోకి దిగారు. అషురెడ్డి కాలి వేళ్లను ముద్దాడటం గురించి మాట్లాడుతూ ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.

తాను షేర్ చేస్తున్న వీడియో ఎవరినీ ఉద్దేశించిది కాదని, ముఖ్యంగా తన సో కాల్డ్ ఫాలోయర్స్ కోసం ఈ వీడియో చేయడం లేదని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. తాను ఏం చేసినా సోషల్ మీడియాలో బిట్లు బిట్లుగా వీడియోలు అప్లోడ్ చేస్తున్నారని, తనపై వికారంగా మీమ్స్ చేస్తున్నారని, అంతేకాకుండా తనపై ఇష్టం వచ్చినట్లు రాసేస్తున్నారని తెలిపాడు. తాను అషురెడ్డితో ఈ ఇంటర్వ్యూ ఎలాంటి అభ్యంతరం లేకుండా చేశానని అన్నాడు.

ram gopal varma…

లైఫ్ లో అందరూ కష్టపడి పని చేస్తారని, ప్రతి ఒక్కరికీ కూడా ఎంటర్టైన్ మెంట్ అనేది కచ్చితంగా అవసరమని ఆర్జీవీ తెలిపారు. ఎవరి టేస్ట్ కి తగ్గట్టుగా వారు ఏదోక ఎంచుకుంటారని, అవి మీకు ఇష్టం లేకుంటే చూడటం మానేయండని ఆర్టీవీ ఫైర్ అయ్యారు. తన వినోదం తాను ఏదోకటి చేస్తుంటే పనిలేనివాళ్లంతా తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని తెలిపాడు. అషురెడ్డి కాళ్లను ముద్దాడుకోవడం తన ఇష్టమని, నచ్చినవాళ్లు చూడండి..నచ్చని వాళ్లు చూడకండని ఖరాకండీగా చెప్పేశాడు. రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago