Movie News

Sarath Kumar: అనారోగ్యంతో ఆస్పత్రికి నటుడు శరత్ కుమార్.. ప్రస్తుతం పరిస్థితి?

Sarath Kumar: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడు అయిన శరత్ కుమార్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. డయేరియాతో డిప్రెషన్ అవ్వడంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చెన్నై అపోలో హాస్పిటల్ లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. శరత్ కుమార్ భార్య రాధిక, కూతురు వరలక్ష్మిలు అపోలో ఆస్పత్రికి చేరుకుని ఆయన బాగోగులు చూసుకుంటున్నారు.

శరత్ కుమార్ అనారోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఇప్పటి వరకూ మీడియా సమావేశం నిర్వహించలేదు. ఆస్పత్రి సిబ్బంది కూడా ఆయన అనారోగ్యంపై ఎలాంటి మెడికల్ బులిటెన్ కూడా ఇవ్వలేదు. మరోవైపు శరత్ కుమార్ అస్వస్థకు గురవ్వడంతో తమిళ సినీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. శరత్ కుమార్ త్వరగా కోలుకుని సంతోషంగా ఇంటికి తిరిగి రావాలని పలువురు సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు.

ఇకపోతే శరత్ కుమార్ 1986లో సమాజంలో స్త్రీ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు. ఆ తర్వాత రెండేళ్లకు కన్ సిముట్టుమ్ నేరమ్ అనే సినిమాతో కోలీవుడ్ లోకి ప్రవేశించారు. ఆ సినిమాను శరత్ కుమారే నిర్మించారు. ఆ సినిమా బాగా ఆడటంతో శరత్ కుమార్ లాభాల బాట పట్టారు. ఆ తర్వాత అటు నిర్మాతగా ఇటు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించారు. ఏడాదిలో పది సినిమాలు చేస్తూ రెండు చేతులారా సంపాదించారు.

Sarath Kumar: శరత్ కుమార్ నటుడిగానే కాకుండా…

శరత్ కుమార్ నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా, సింగర్ గా కూడా పనిచేశారు. దాదాపు 130 సినిమాల్లో ఆయన నటించారు. నిర్మాతగా 11 సినిమాలు చేశారు. ఈ మధ్యకాలంలో తెలుగులో శరత్ కుమార్ రామ్ చరణ్ తో జయ జానకి నాయక సినిమాలో కనిపించారు. ఆ తర్వాత మహేష్ బాబుతో భరత్‌ అనే నేను, బన్నీ సినిమా అయిన నా పేరు సూర్య, గోపిచంద్ సినిమా సాక్ష్యం వంటి వాటిల్లో కనిపించారు. ప్రస్తుతం ఆయన వారసుడు సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఆయనకు అనారోగ్యం వాటిళ్లడం బాధాకర విషయం అని, ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు సెలబ్రిటీలు కోరుకుంటున్నారు. ప్రస్తుతం శరత్ కుమార్ క్షేమంగా ఉన్నట్లు, ఆయన అనారోగ్యం నుంచి కుదుటపడినట్లు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

24 hours ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

24 hours ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

24 hours ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago