Featured

Ram Gopal Varma : ఒకడు నా దగ్గరకు వచ్చి నన్ను బూతులు తిట్టాడు… దాంతో నా భార్యకి నా మీద కోపం వచ్చింది : రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ… ఆ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది వివాదాలే. తాను ఒక సినిమా చేస్తున్నాడు అంటే వివాదాలతోనే తనకు కావలసిన పబ్లిసిటీ తెచ్చుకుంటాడు. మొదట తెలుగులోనే తన కెరీర్ ను ప్రారంభించిన ఆర్జీవి తరువాత బాలీవుడ్ లో స్థిరపడిపోయాడు. ఒకప్పుడు ఇండస్ట్రీకి శివ, క్షణక్షణం, రంగీలా, భూత్, కంపెనీ, సత్య వంటి సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఆర్జీవి తీసే సినిమాలు అప్పట్లో తీసిన సినిమాల లాగా ఉండవు అన్న వాదన కూడా లేకపోలేదు. ఇది ఇలా ఉండగా తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్షణక్షణం సినిమా గురించిన కబుర్లు చెప్పారు.

ఒకడు బూతులు తిట్టాడు…

క్షణక్షణం సినిమా విషయంలో మొదటి సారి చాలా బాధపడ్డాను అంటూ తెలిపారు. ఫెయిల్యూర్ ను తీసుకోలేక కొంత ఇబ్బంది పడ్డానని అయితే అది ఎక్కువ సేపు కాదంటూ తెలిపారు. ఆ సినిమా థియేటర్ కి వచ్చాక విజయవాడలో ఒక థియేటర్ లో రెస్పాన్స్ చూడటానికి వెళ్లగా అక్కడ సినిమా చూసి బయటికి వచ్చిన ఒక వ్యక్తి నేను ఎవరని తెలియకుండానే నా ముందు నన్ను బూతులు తిట్టాడు, శివ సినిమా తీసింది వీడేనా అంటూ తిట్టాడు.

అది మర్చిపోలేక పోయాను. ఇక దేవి థియేటర్ హైదరాబాద్ లో సినిమా నూరు రోజులు ఆడుతుందని ఆ థియేటర్ ఓనర్ చెప్పడంతో కొంత ఊరట చెందినా మళ్ళీ వేరే వాళ్ళు ఆ సినిమా రేపో ఎల్లుండో తీసేస్తారు అని మా మావయ్యకు వార్త అందడంతో ఆయన సినిమా పోయిందట కదా, దేవి లో కూడా తీసేస్తారట అన్నపుడు షాక్ అయ్యాను. ఇంటికి వచ్చి రూమ్ లో కూర్చొని ఉంటే నా భార్య భుజం మీద చేయి వేసి ఓదార్చే ప్రయత్నం చేయగా నేను ఏమి బాధపడటం లేదు నీ సింపతీని వేస్ట్ చేయొద్దు నా మీద అని చెప్పగానే నా భార్య కు చాలా కోపం వచ్చింది అంటూ నాకు ఎవరైనా సింపతీ చూపిస్తే నచ్చదు అంటూ వర్మ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago