Featured

Ram Gopal Varma : కోదండ రామిరెడ్డి సినిమా చెడగొట్టాలని కుట్ర చేసాను… కీరవాణికి మాటిచ్చి తప్పాను..: ఆర్జీవి

Ram Gopal Varma : వివాదాలతో బతికే జీవి ఆర్జీవి. ఏదో ఒక ఒకవిషయంలో కాంట్రావెర్సీ క్రియేట్ చేసి తనని తాను ప్రమోట్ చేసుకుంటూ ఉండే ఆర్జీవి మరోసారి అందరికీ షాక్ ఇచ్చాడు. సినిమాకు ప్రమోషన్స్ వింతగా చేసే ఆర్జీవి తాను తీసిన సినిమాలను జనాలు ఎపుడో మర్చిపోయినా తాను చేసే, మాట్లాడే కాంట్రావెర్సీల కోసం మాత్రమే ఎదురుచూస్తుంటారు. అయితే ఇదంతా ఇప్పుడు, ఒకప్పుడు వర్మ వేరు. తెలుగు సినిమాకు కొత్త ట్రెండ్ ను తెచ్చిన ట్రెండ్ సెట్టర్ వర్మ. ‘శివ’ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ సినిమా తీరును మార్చేశాడు. స్టడీ కెమెరాను వాడి సినిమా విజువల్స్ కి కొత్తదనం తీసుకొచ్చి అందరినీ ఆకర్శించాడు వర్మ. ఇక శివ సినిమా గురించి మరిన్ని విశేషాలను వర్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

కోదండరామి రెడ్డి సినిమా చేయకుండా కుట్ర చేసాను…

డైరెక్టర్ గోపాల్ వద్ద మొదట అప్ప్రెంటీస్ గా చేరిన ఆర్జివి ‘కలెక్టర్ గారి అబ్బాయి’ సినిమాకు పనిచేసాడు. అయితే సెట్స్ లో ఏం పని చేయకుండా ఊరికే తిరుగుతూ ఉండేవాడట. ఇక ఆ సినిమా సమయంలో నాగార్జున తో పరిచయం ఏర్పడి బాగా క్లోజ్ అయ్యాడట ఆర్జివి. వర్మకు సినిమా మీద పట్టు ఉందని నాగార్జునకు నమ్మకం పెరిగినా అప్పటికి ఇంకా స్వంతంగా నిర్ణయాలు తీసుకునేవాడు కాదు, అక్కినేని వెంకట్, నాగేశ్వరావు గారు గైడన్స్ ఇచ్చేవారట. అదీకాక ఫ్లాప్స్ లో ఉండటం వల్ల కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వాలంటే రిస్క్ అనుకున్నారట నాగ్. ఇక కలెక్టర్ గారి అబ్బాయి సినిమా హిట్ అయ్యాక నాగార్జున కోదండరామి రెడ్డి సినిమాకు కమిట్ అయ్యారు. అయితే గణేష్ పాత్రో ఆ సినిమాకు కథ అందించగా ఆ కథ నాగేశ్వరావు గారికి వినిపించడానికి చెన్నై నుండి హైదరాబాద్ కు వర్మను పంపించారు. కోదండ రామి రెడ్డి సినిమా పక్కకు పోతే నాగార్జున డేట్స్ ఖాళీగా ఉంటాయి కాబట్టి నేను అడిగి సినిమా తీయొచ్చు అంటూ ఆర్జీవి భావించి ఉన్న కథను మార్చి నాగేశ్వరావు గారికి కథ చెప్పి కుట్ర చేసాడు.

ఇక ఆ కథ నచ్చక నాగేశ్వరావు గారు కథ మార్చమని చెప్పగా తక్కువ టైములో కథ మార్చాలంటే కష్టం అని కోదండ రామిరెడ్డి అనుకుని టైం అడిగారట. ఇక ఆ టైములో వర్మ నాగార్జున వద్దకు వెళ్లి నేను సినిమా తీస్తా అని చెప్పి ఒప్పించారట. ఇక మళ్ళీ కోదండ రామి రెడీ ప్రొజెక్ట్ ఎక్కడ తెర మీదకు వస్తుందో అని కొత్త డైరెక్టర్ తో సినిమా అని లీక్ ఇప్పించాడట. ఇక సినిమా కథ పూర్తిగా నాగార్జున, వెంకట్, నాగేశ్వరావు ఇలా ఎవరికీ చెప్పలేదట వర్మ, కేవలం సీన్స్ కొన్ని చెప్పి ఇంప్రెస్స్ చేసాడట. అయితే నాగార్జున కెరీర్ లో శివ సినిమా ఒక మైలు రాయి అని చెప్పొచ్చు. ఇక తన మొదటి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి ని పెట్టుకుంటానని మాటిచ్చి చివరకు ఇళయరాజాను పెట్టుకున్నాడట ఆర్జివి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago