Ram Gopal Varma : నాలుగేళ్ల పిల్లాడిని కుక్కలు చంపేస్తే ఏ సెలబ్రిటీ కూడా పట్టించుకోలేదు…: రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma : ఎపుడూ వివాదాలతో జీవించే ఆర్జీవి ప్రస్తుతం రాజకీయాల మీద పడ్డారు. అందునా ఏపీ రాజకీయాల మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ టీడీపీ జనసేన పార్టీల మీద విమర్శలను గుప్పిస్తున్నారు. అయితే తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఒక దారుణ సంఘటన గురించి ఎవరూ పట్టించుకోకపోవడం విస్మయానికి గురి చేస్తే ఆ ఇష్యూ మీద అర్జీవి తన గళం వినిపించారు. హైదరాబాద్ లో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ళ చిన్నారి చనిపోతే ఆ సంఘటన ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఆర్జీవి మాత్రం ఆ ఇష్యూ మీద తన స్టైల్ లో ట్వీట్ చేసి దట్ ఈజ్ ఆర్జీవి అనిపించుకున్నాడు.

నాలుగేళ్ళ కుర్రాడిని కుక్కలు చంపితే ఒక్క స్టార్ కూడా స్పందించలేదు…

ఆర్జీవి కుక్కల దాడి లో చిన్నారి మరణం గురించి మాట్లాడుతూ నేను చూసిన అత్యంత క్రూరమైన వీడియోల్లో ఇదే మొదటిది. ఒక చిన్నారిని కుక్కలు లాక్కెళ్లడం అది కూడా నగరం మధ్యలో సంఘటన జరిగింది. కానీ ఏ ఒక్క సినిమా సెలబ్రిటీ కానీ ప్రముఖులు కానీ స్పందించలేదు. స్పందిస్తే ఏమవుతుందో అన్నట్లుగా చూసి చూడనట్లు ప్రవర్తించారు.

నగరంలో కుక్కలు ఎన్ని ఉన్నాయని అడిగితే దాదాపు 6 లక్షలు అని జహెచ్ఏంసి కమిషన్ చెబుతోంది. అందులో వాస్తవం ఎంత.. అదీ కాక వాళ్ళు చెప్పినట్లే ఆరు లక్షల కుక్కలు ఉంటే వాటిలో ఎన్నింటికి ఆపరేషన్ చేసారు లెక్క వారికి ఎలా తెలుసుస్తుంది. అంత సిబ్బంది వారి దగ్గర ఉన్నారా అంటూ వర్మ ప్రశ్నించారు. అందుకే నగర మేయర్ ఇంట్లోకి ఒక ఐదు లక్షల కుక్కల్ని వదిలితే ఎలా ఉంటుందో ట్వీట్ చేశాను అంటూ చెప్పారు.