Ram Gopal Varma: ఆర్జీవీ అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది వివాదాలు. సినిమా అయినా ఇంటర్వ్యు అయినా లేక ఎవరి గురించైనా మాట్లాడినా అది ఒక వివాదమే. అది ఒక ఆర్జీవీ వల్ల మాత్రమే సాధ్యం. ప్రతి విషయంలో వివాదం, ఆర్జీవీ ముందు పుట్టి వివాదం తరువాత పుట్టిందా లేక వివాదం ముందు పుట్టి ఆర్జీవీ తరువాత పుట్టారా లేక ఇద్దరూ కలిసే పుట్టారా అన్నంతగా వివాదాలతో మమేకమై ఉంటారు ఆర్జీవీ. ఎప్పుడో కానీ ఒక విషయం గురించి గొప్పగా మాట్లాడరు. అలాంటి ఆర్జీవీ ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూ లో శంకరాభరణం గురించి చాలా విషయాలు పంచుకున్నారు.
ఆచారానికి మరో పేరు శంకరాభరణం…
తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఆర్జీవీ శంకరాభరణం చిత్రం గురించి చాలా గొప్పగా మాట్లాడారు. మన ఆచారాలకు మరో పేరు శంకరాభరణం సినిమా అని, ఆ చిత్రం ద్వారా చాలా నేర్చుకున్నా అని చాలా గొప్పగా చెప్పారు. తన చిన్నతనంలో స్టూడెంట్ గా ఉన్న సమయంలో డ్రైవర్ రాముడు, అడవి రాముడు, వేటగాడు లాంటి ఆక్షన్ చిత్రాల ట్రెండ్ డామినేట్ చేస్తున్న సమయంలో శంకరాభరణం చిత్రం ఒక క్లాసికల్ హిట్ అని కొనియాడారు. ఈ చిత్రం లో శంకర శాస్త్రి గా సోమయాజులు గారు మరియు మంజు భార్గవి గారి నటన చాలా అద్భుతంగా ఉందని అన్నారు. మన సాంప్రదాయ సంగీతాన్ని మరచి పాశ్చాత్య సంగీతానికి బానిసైన ఒక వ్యక్తికి మళ్ళీ దాని గొప్పదనాన్ని గుర్తు చేసే వైనం సినిమా లో బాగా నచ్చిన అంశం అని పొగిడారు. మన సాంప్రదాయ సంగీతాన్ని మరచిపోయి పాశ్చాత్య సంగీతం వైపు మొగ్గు చూపుతున్న వారికి గొడ్డలిపెట్టుగా ఈ సినిమా రూపొందించబడింది అని, మన సంగీతం కంటే గొప్పగా ఏవి లేవని ఈ సినిమా ద్వారా తెలియచేశారు అన్నారు.
ఇక సినిమా గురించి ఆర్జీవీ తనదైన శైలిలో అభివర్ణించారు. “పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సాంప్రదాయ భారతీయ సంగీత జ్యోతిని కాపు కాయతనికి చేతులు అడ్డు పెట్టిన మహామనిషికి శిరస్సు వంచి పాదాభి వందనం చేస్తున్నాను” అంటూ తనకు ఆ సినిమా మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆ చిత్రం లోని ‘దొరకునా ఇటువంటి సేవ’ అనే పాట తనని కదలించింది అన్నారు. తను ఆచారాలు పాటించటం పాటించక పోవటం పక్కన పెడితే ఈ సినిమా ద్వారా ఆచారాల గురించి తాను చాలా నేర్చుకున్నా అని అన్నారు. ఆర్జీవీ గారి నోటి నుండి ఇలాంటివి విన్నప్పుడు వివాదాల మధ్య బ్రతికే జీవికి ఇలాంటి ఒక కనపడని కోణం కూడా ఉందా.. అనిపిస్తోంది.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…