Balakrishna : బాలకృష్ణ జూన్ 10న 62పుట్టినరోజుని చాలా ఘనంగా చేసుకున్నారు. ఇక బాలయ్య నటిస్తున్న 107వ చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న పిక్చర్ ట్రైలర్ ను హంట్ మొదలయింది అంటూ సోషల్ మీడియాలో విడుదల చేసారు. అభిమానుల నుండే కాకుండా కామన్ ప్రేక్షకుల నుండి కూడా ట్రైలర్ కి మంచి స్పందన వస్తోంది. అభిమానులు కూడా ఆయన పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు.
బసవతారకం హాస్పిటల్ లో మనవళ్ళతో పుట్టినరోజు…
ఇక బాలకృష్ణ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అంటే చాలా ఇష్టం. ఆ హాస్పిటల్ ద్వారా ఎంతో మంది కాన్సర్ వ్యాధికి గురైన వారికి చికిత్స అందిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బాలకృష్ణ మానస పుత్రిక గా అభివర్ణించవచ్చు. నిత్యం హాస్పిటల్ పర్యవేక్షణ బాధ్యతలను ఆయన చూసుకుంటున్నారు. అత్యాధునిక సేవలను అందుబాటులో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. చిన్న పిల్లలకు ఉచిత వైద్య సహాయం కూడా అందిస్తున్నారు. ఇప్పుడు ఆయన 62 వ పుట్టినరోజు వేడుకలను బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ లో అక్కడి స్టాఫ్, పేషెంట్స్ మధ్య జరుపుకున్నారు.
ఈ వేడుకలను తన మనవళ్ళ తో కలిసి జరుపుకున్నారు. ఇక ఈవేడుకలో నారా బ్రాహ్మణి, తేజస్విని భర్త భరత్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణితో ఫోటో దిగేందుకు పలువురు ఆసక్తి చూపగా బాలయ్య ఒక్క సెల్ఫీ అంట ఇవ్వమ్మా అనగానే బ్రాహ్మణి వారితో సెల్ఫీ తీసుకుంది. మరికొందరు ఇబ్బంది పడుతుంటే అక్క ఇటివ్వు నేను తీస్తా అంటూ తానే సెల్ఫీ తీసి అభిమానుల కోరిక తీర్చింది. ఇక మనవళ్లతో కలిసి బాలకృష్ణ 62 కిలోల కేక్ కట్ చేసి వారితో తినిపించుకున్నారు. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. నందమూరి అభిమానులు నారా బ్రాహ్మణి ని చూసి ముచ్చట పడుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…