Vignesh Shivan: తిరుమల వ్యవహారం పై స్పందించిన విగ్నేష్… కంగారులో మర్చిపోయాం.. క్షమించండి అంటూ బహిరంగ క్షమాపణ!
Vignesh Shivan: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నటువంటి నయనతార ఎట్టకేలకు జూన్ 9వ తేదీన తన ప్రియుడు విఘ్నేష్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మహాబలిపురంలోని ఒక రిసార్ట్ లో వీరి వివాహం జరిగింది. అయితే ఈ జంట పెళ్లయిన మరుసటిరోజే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుపతి వచ్చారు. అయితే స్వామివారిని దర్శించుకున్న అనంతరం నయనతార దంపతులు తిరుమల మాడ వీధులలో చెప్పులు ధరించడం పెద్దఎత్తున వివాదానికి దారి తీసింది.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా నయనతార పై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇకపోతే నయనతార విగ్నేష్ దంపతుల వ్యవహారశైలిపై టిటిడి అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇకపోతే ఈ వ్యవహారశైలిపై విగ్నేష్ స్పందిస్తూ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా విగ్నేష్ మాట్లాడుతూ…
అందరికీ నమస్కారం.. నిజానికి మా పెళ్లి తిరుపతిలోనే చేసుకోవాలని భావించాము. కాని కొన్ని కారణాల వల్ల తిరుపతిలో కాకుండా మా పెళ్లి మహాబలిపురంలో చేసుకోవలసి వచ్చింది.పెళ్లయిన తర్వాత ఇంటికి కూడా వెళ్లకుండా స్వామివారి దర్శనం కోసం తిరుపతి వచ్చామని గత నెలలో మేము స్వామివారి దర్శనం కోసం ఐదుసార్లు తిరుపతికి వచ్చినట్లు తెలిపారు. స్వామివారి దర్శనం తర్వాత ఆలయం బయట ఫోటోషూట్ చేయించుకోవాలని భావించాము.
బయట రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల కాసేపు ఆగి ఆ హడావిడిలో చెప్పులు వేసుకున్నాము అనే విషయం కూడా మరిచిపోయి వచ్చామని, ఉద్దేశపూర్వకంగా ఎవరి మనోభావాలను దెబ్బ తీయాలని కానీ ,ఆలయ కట్టుబాట్లను అగౌరవపరచారని కానీ తాము ఆ పని చేయలేదని,పొరపాటున జరిగిన ఈ తప్పు వల్ల మనోభావాలు దెబ్బ తిన్న వారందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను అంటూ విగ్నేష్ బహిరంగంగా క్షమాపణలు తెలియజేశారు. అదే విధంగా తమ పెళ్లికి శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ కూడా విగ్నేష్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…