Featured

‘బోడి నా కొడుకు’ అంటూ రాజమౌళిపై సంచలన కామెంట్స్ చేసిన ఆర్జీవీ!

రామ్ గోపాల్ వర్మ పరిచయం అక్కర్లేని పేరు. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు ఆర్జీవీ. ఎప్పుడు ఎవరి మీద కామెంట్ చేస్తారో.. ఎవరిని టార్గెట్ చేస్తారో తెలియదు. వర్మ ఎలాంటి కామెంట్ చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సినిమాలతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసినప్పటికీ ఎక్కువగా ఆయన చెప్పే మాటలకే చాలామంది ఫ్యాన్స్ అయిపోతుంటారు.

సినిమాలను చాలా మంది థియేటర్లు లేక ఓటీటీలకు ఇస్తుంటే.. అతడు మాత్రం ఆర్టీవీ థియేటర్ అంటూ చిన్నపాటి ఓటీటీ లాంటిది ఏర్పాటు చేసుకొని తన సినిమాలను అందులోనే విడుదల చేస్తుంటారు. అలా అందరు ఒక వైపు ఉంటే.. అతడు మాత్రం నాదారే రాహదాని అన్నట్లు ఓ వైపు ఉంటాడు. అయితే ఇటీవల సునీల్ నటించిన ‘కనబడుట లేదు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆర్జీవీ, విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆ ఈవెంట్‌లో వర్మ స్పీచ్ అందరికంటే హైలెట్ అయింది.

రచయిత కే.విజయేంద్ర ప్రసాద్ గడ్డం గురించి ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దీనిలో రాజమౌళి పేరు ప్రస్తావించారు. విజయేంద్ర ప్రసాద్ గడ్డం గురించి వర్మ అడిగి నవ్వులు పూయించారు.

నా పెద్ద డౌట్ ఏంటంటే.. మీ గడ్డానికి స్ఫూర్తి ఎవరు? నరేంద్రమోడీనా? లేకపోతే రామాయణం మించిన అద్భుతమైన బాహుబలి కథను ఇచ్చారు కాబట్టి వాల్మీకి కంటే పెద్దగా ఉండాలని అనుకున్నారా? లేదా నా బోడి కొడుక్కే అంత ఉంటే.. నాకు ఎంత ఉండాలని రాజమౌళి కంటే ఎక్కువగా ఉండాలని పెంచుతున్నారా? అని విజయేంద్ర ప్రసాద్‌ను ఆట పట్టించారు వర్మ. ఇక ఆ మాటలకు విజయేంద్రప్రసాద్ నవ్వుతూనే ఆర్జీవికి రెండు చేతులెత్తి నమస్కారం చేశారు. దీంతో అక్కడ జనాలు విజల్స్ తో క్లాప్స్ కొట్టారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago