రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఒక హర్రర్ సినిమాల్లో నటించాలని ఆశతో ఆడిషన్స్ కి వెళ్ళిన బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ కి రామ్ గోపాల్ వర్మ నుంచి చేదు అనుభవం ఎదురైంది. ర్యాన్ ఆడిషన్స్ లో రాంగోపాల్ వర్మ తనని రిజెక్ట్ చేశారని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సయ్యద్ సొహేల్ ఈ విషయాన్ని స్వయంగా ఓ కార్యక్రమంలో తెలియజేశారు . తాజాగా సోహైల్ రాంగోపాల్ వర్మ “డియర్ మేఘ” ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే.
అర్జున్ దాస్యం నిర్మాణ సారథ్యంలో సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో అదిత్ అరుణ్, మేఘా ఆకాశ్ జంటగా నటించినటువంటి చిత్రం డియర్ మేఘ. ఈ చిత్రం సెప్టెంబర్ 3వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న సోహైల్ఈ సందర్భంగా మాట్లాడుతూ తను రామ్ గోపాల్ వర్మను రెండోసారి కలిశానని అయితే మొదటి సారి కలిసినప్పుడు తన హారర్ సినిమా ఆడిషన్స్ లో భాగంగా వెళితే నన్ను రిజెక్ట్ చేశారని, అప్పటికి నేను ఇంకా చాలా చిన్నవాడిని అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు.
రాంగోపాల్ వర్మ గురించి సోహైల్ ఈ విధంగా మాట్లాడటంతో స్టేజ్ ముందు కూర్చున్న రామ్ గోపాల్ వర్మ ఏదో మాట్లాడాలని పోతే.. అందుకు సోహైల్ “ఇప్పుడు ఇంక మాట్లాడకండి సార్..పంచ్.. బయమైతంది”. అంటూ సోహెల్ మాట్లాడారు. సోహైల్ తనను రామ్ గోపాల్ వర్మ హర్రర్ మూవీ ఆడిషన్స్ లో రిజెక్ట్ చేశారని చెప్పారు కానీ ఏ హర్రర్ మూవీ అనే విషయం మాత్రం వెల్లడించలేదు.
అయితే అంత చిన్న వయసులో రామ్ గోపాల్ వర్మ కి సోహైల్ అంటే ఎవరో తెలియదు కనుక ఆ ఆఫర్ వచ్చిండదని భావించవచ్చు. ఇక బిగ్ బాస్ సీజన్ ఫోర్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న సోహైల్ ప్రస్తుతం సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…