RGV: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలబడే రామ్ గోపాల్ వర్మ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే ఈయన వరుస ట్వీట్లు చేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను పాన్ ఇండియా హీరోగా చూడాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా వర్మ స్పందిస్తూ…పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు సర్దార్ గబ్బర్ సింగ్ హిందీలో రిలీజ్ చేయొద్దు వర్కౌట్ కాదనీ ట్విట్టర్ ద్వారా ఎంత చెప్పినా మీరు వినలేదు. ఫలితం చూశారు ఇప్పుడు మరోసారి చెబుతున్నాను.
మీరు నటించిన భీమ్లా నాయక్ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయండి.. మిమ్మల్ని మీరు ప్రూఫ్ చేసుకోండి అంటూ చెప్పుకొచ్చారు.పాన్ ఇండియా స్థాయిలో పుష్ప అంతా కలెక్షన్లు రాబడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మీ సినిమా ఇంకెంత రాబట్టాలి. అని వర్మ ప్రశ్నించారు.
మీ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయకపోతే బన్నీ అభిమానులకు మీ ఫాన్స్ గా మేము ఏం సమాధానం చెప్పాలి. అల్లు అర్జున్ గురించి నేను చేసిన ట్వీట్స్ అన్ని వోడ్కా టైంలో చేసినవి, కానీ మీ గురించి చేసేవన్నీ కాఫీ టైం లో చేస్తున్నాను. కాబట్టి వీటిని సీరియస్ గా తీసుకోండి అంటూ సలహా ఇచ్చారు.
ఎప్పుడో మీ తర్వాత వచ్చిన చిన్న పిల్లలు అందరూ కూడా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి పోయారు. ఆంధ్రా లో జరిగిన ఒక సబ్జెక్ట్ పాన్ ఇండియా అయినప్పుడు, ఒక అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ సినిమా పాన్ ఇండియా అయినప్పుడు భీమ్లా నాయక్ సినిమా పాన్ ఇన్ ఇండియా కాదంటారా..అంటూ పవన్ కళ్యాణ్ సినిమా గురించి వర్మ ఇలా ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ విషయంపై కొందరు స్పందిస్తూ వర్మ అబద్ధం చెబుతున్నాడు. కాఫీలో వోడ్కా కలుపుకున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…