Ramaprabha: తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రమాప్రభ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె సుమారు వెయ్యి సినిమాలకు పైగా నటించి ఎన్నో అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇలా హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించిన రమాప్రభ తన జీవితంలో ఒక స్టార్ హీరోని నమ్మి దారుణంగా మోసపోయానని తెలిపారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రమాప్రభ తన జీవితంలో జరిగిన చేదు సంఘటనల గురించి చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ రోడ్డుపై నిలబడ్డానని తెలిపారు.ఆ సమయంలో ఎవరి సహాయం అడగాలని ఆలోచిస్తున్న తరుణంలో రజనీకాంత్ గుర్తుకు వచ్చి రజనీకాంత్ వద్దకు వెళ్లానని ఈమె తెలిపారు. రజనీకాంత్ దగ్గరికి వెళ్లి తాను సహాయం అడగగా ఆయన ఏ మాత్రం ఆలోచించకుండా నాకు 40 వేల రూపాయలు ఇచ్చారని తెలిపారు.
నేను రజనీకాంత్ గారు దారి ఖర్చులకు డబ్బులు ఇస్తే చాలు అని అనుకున్నాను. కానీ ఆయన మాత్రం ఏమీ ఆలోచించకుండా ఒకేసారి 40 వేల రూపాయలు నా చేతిలో పెట్టారని ఆయన చేసిన ఆ సహాయము నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఈ సందర్భంగా రమాప్రభ రజినీకాంత్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక రజనీకాంత్ సినిమా ఇండస్ట్రీలో ఏలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో మనకు తెలిసిందే.ఈయన కోలీవుడ్ చిత్రపరిశ్రమకు హీరో అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఈయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇక తన వద్దకు ఎవరైనా సహాయం కోరి వస్తే లేదనుకున్న వారికి సహాయం చేసే గుణం రజనీకాంత్ కు కలదు. ఇలా తాను కూడా సహాయం కోరడంతో ఆయన తనకు చేసిన సహాయం గురించి రమాప్రభ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…