Rambha: సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రంభ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఈమె ఒకప్పుడు తెలుగు తమిళ భాషలలో మాత్రమే కాకుండా భోజ్ పురి చిత్రాలలో కూడా నటించి మెప్పించారు. ఇలా వివిధ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఈ విధంగా రంభ సినిమాలలో హీరోయిన్ గా నటించడమే కాకుండా పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ ద్వారా కూడా సందడి చేశారు. ఇలా ఎన్టీఆర్ అల్లు అర్జున్ వంటి హీరోల సినిమాలలో ఈమె స్పెషల్ సాంగ్స్ చేస్తూ సందడి చేశారు. ఇక పెళ్లి తర్వాత పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరమైనటువంటి రంభ తన భర్త పిల్లలతో కలిసి విదేశాలలో స్థిరపడ్డారు.
ఇకపోతే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన సినీ కెరియర్ గురించి పలు విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా రంభ మాట్లాడుతూ తనకు ఎన్టీఆర్ డాన్స్ అంటే చాలా ఇష్టమని తాను డాన్స్ చేస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోతానని తెలియజేశారు. ఇక ప్రభాస్ నటన అన్న కూడా చాలా ఇష్టమని ఈమె తెలియజేశారు.
ఎప్పటికైనా ప్రభాస్ తో కలిసి నటించాలన్నదే తన కళ అని తెలిపారు. ఒకవేళ ప్రభాస్ తో కనుక నటించే అవకాశం వస్తే తాను తన భర్తతో గొడవ పడి అయినా సరే ప్రభాస్ సినిమాలో నటిస్తాను అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ అంటే తనకు ఉన్నటువంటి ఇష్టాన్ని తెలియజేస్తూ రంభ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కామెంట్స్ విన్నటువంటి ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…