Priyamani: సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రియమణి కొంతకాలం కిందట సినిమాలకు దూరమై బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేశారు. అయితే ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమే తాజాగా నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమాలో ఈమె సీఎం పాత్రలో నటించారు ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో తన గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై స్పందించారు. ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ… సోషల్ మీడియా వేదికగా తనను తరచూ విమర్శలు చేస్తూనే ఉన్నారని తెలిపారు. కెరియర్ మొదట్లో తనని బాడీ షేమింగ్ చేశారని తాను కలర్ తక్కువగా ఉన్నానంటూ తన కలర్ గురించి కూడా మాట్లాడారని ఈమె తెలియజేశారు.
ఇకపోతే తాను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా తన పెళ్లి పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత చూపించారని ఈమె ఈ సందర్భంగా వెల్లడించారు. తాను ముస్తఫా రాజ్ తో నిశ్చితార్థం జరుపుకున్న తర్వాత అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తమ నిశ్చితార్థపు ఫోటోలు పై చాలా మంది తీవ్ర వ్యతిరేకత చూపించారని ఈమె తెలియజేశారు.
ఇలా మా ఎంగేజ్మెంట్ ఫోటోలపై స్పందించిన కొందరు నువ్వు ఎందుకు ఇలా ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నావు అంటూ తనని ప్రశ్నించారని ఈమె తెలిపారు. ఇలా నా గురించి కామెంట్స్ చేసిన వారందరికీ నేను చెప్పేది ఒకటే,ఇది నా జీవితం నా జీవితాన్ని ఎవరితో పంచుకోవాలి అనేది పూర్తిగా నా నిర్ణయం అంటూ ఈ సందర్భంగా ఈమె కామెంట్ చేశారు. ఇలా అప్పటినుంచి తాను సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి పెద్దగా పట్టించుకోవడం మానేశానని తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…