Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇన్ని రోజులు తన భార్య ఉపాసన డెలివరీ కావడంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు.
ఇలా షూటింగ్ కి కొన్ని రోజులపాటు బ్రేక్ ఇచ్చినటువంటి రామ్ చరణ్ తిరిగి సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు. ఇకపోతే తాజాగా రాంచరణ్ కి సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా రామ్ చరణ్ ను ప్రశ్నిస్తూ టాలీవుడ్ స్టార్ హీరోస్ అయినటువంటి అల్లు అర్జున్ ఎన్టీఆర్ మహేష్ బాబు ఈ ముగ్గురిలో ఉన్నటువంటి ఏ క్వాలిటీ మీలో ఉంటే బాగుంటుందని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు రాంచరణ్ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.ఎన్టీఆర్ చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు ఆయనలో ఉన్న ఎనర్జీ నాకు అసలు లేదు అందుకే తన ఎనర్జీ నాకు ఉంటే బాగుంటుందనిపిస్తుందని చరణ్ తెలిపారు. ఇక అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ బన్నీ చాలా స్పోర్టివ్ గా ఉంటారు. ఎవరైనా ఏదైనా అంటే దాని గురించి పెద్దగా ఆలోచించరు సరదాగా తీసుకొని ముందుకు వెళుతుంటారు.
ఇక మహేష్ బాబు గురించి చెప్పాల్సిన పనిలేదు ఆయన చాలా అందంగా ఉంటారు. ఆయనలో ఉన్నటువంటి కాస్త అందం నాకు ఉంటే బాగుంటుందని ఈ సందర్భంగా ఈ స్టార్ హీరోలలో ఉన్నటువంటి క్వాలిటీస్ తనలో లేవని ఆ క్వాలిటీస్ ఉంటే బాగుండేదంటూ ఈ సందర్భంగా రామ్ చరణ్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…