Movie News

Ramcharan: పుట్టబోయే నా బిడ్డకు జపాన్ కు సంబంధం ఉంది… రామ్ చరణ్ కామెంట్స్ వైరల్!

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన మరో రెండు నెలలలో తల్లిదండ్రులు కాబోతున్న విషయం మనకు తెలిసిందే. పెళ్లయిన తర్వాత దాదాపు పది సంవత్సరాలకు ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో ఈ సంగతి మెగా కుటుంబంలోనూ అలాగే అభిమానులలోను ఎంతో సంతోషాన్ని కలిగించింది.ఇలా రాంచరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారన్న వార్త తెలియగానే బుల్లి వారసుడి కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి.

ఇక ఉపాసన సైతం ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అనౌన్స్ చేసినప్పటి నుంచి తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన అన్ని విషయాలను అలాగే తన బేబీ షవర్ వేడుకలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. ఇలా ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీ విషయాలను తెలియచేస్తూ అభిమానులలో సంతోషాన్ని నింపుతున్నారు. ఇకపోతే తాజాగా రాంచరణ్ సైతం తనకు పుట్టబోయే బిడ్డ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం రామ్ చరణ్ కాశ్మీర్ లో జరుగుతున్న జి 20 సదస్సులో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ పలు ఇంటర్వ్యూలలో కూడా ఈయన పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రామ్ చరణ్ తనకు పుట్టబోయే బిడ్డ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ తనకు జపాన్ అంటే ఎంతో ఇష్టమని తెలియజేశారు.

Ramcharan: మ్యాజిక్ మొత్తం జపాన్ లో జరిగింది…


తనకు పుట్టబోయే బిడ్డకు జపాన్ కు మంచి అనుబంధం ఉందని అందుకే తనకు జపాన్ అంటే చాలా ఇష్టం అని జపాన్ అంటే తన మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని చరణ్ తెలియజేశారు.ప్రస్తుతం ఉపాసన ఏడవ నెల ప్రెగ్నెంట్ అయితే ఈ మ్యాజిక్ అంతా జపాన్లోనే జరిగింది అంటూ ఈయన సరదాగా నవ్వుతూ తన పుట్టబోయే బిడ్డ గురించి తెలియజేశారు. అయితే RRR ప్రమోషన్లలో భాగంగా జపాన్ వెళ్లి వచ్చిన తర్వాత వీరిద్దరు తమ ప్రెగ్నెన్సీని కన్ఫామ్ చేసిన విషయం మనకు తెలిసిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago