Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమా తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈయన ఈ సినిమా తర్వాత ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
ఇకపోతే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో నటించబోతున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్ మరొక బాలీవుడ్ డైరెక్టర్ సినిమాలో నటించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గత ఏడాది ది కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా ద్వారా సంచలనం సృష్టించిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది.ఈ సినిమా ద్వారా ఒక్కసారిగా ఎంతో ఫేమస్ అయినటువంటి డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి అనంతరం పలు వివాదాల ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే వివేక్ దర్శకత్వంలో చరణ్ సినిమా ఉంటుందని వార్తలు రావడానికి ఓ కారణం ఉంది.
సోషల్ మీడియా వేదికగా ఒక నెటిజన్ వివేక్ అగ్నిహోత్రి రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని ఉంది అని ట్వీట్ చేయడమే కాకుండా… ఈ ట్వీట్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి ట్యాగ్ చేశారు. దీంతో ఈట్వీట్ కు రిప్లై ఇచ్చిన వివేక్ అగ్నిహోత్రి మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ రీ ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఈట్వీట్ వైరల్ కావడంతో ఎంతోమంది మెగా అభిమానులు నిజంగానే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…