General News

Rishab Pant: అతనికి ఓ ఫ్యామిలీ ఉంది… రిషబ్ ప్రమాదంపై రోహిత్ సతీమణి ఫైర్… అసలేం జరిగిందంటే?

Rishab Pant: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే.నూతన సంవత్సర వేడుకలను తన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపడం కోసం ఉత్తరాఖండ్ వెళ్తున్న సమయంలో ఈయన కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి రిషబ్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఈయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

ఇలా ఈయనకు ప్రమాదం జరగడంతో ఎంతోమంది అభిమానులు తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించడమే కాకుండా ఈయన ఆక్సిడెంట్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రిషబ్ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే రిషబ్ ప్రమాదానికి సంబంధించిన ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసే నేటిజనులపై క్రికెటర్ రోహిత్ సతీమణి రితికా సజ్దే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఈమె స్పందిస్తూ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసే వారిని చూస్తే చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఎవరైనా బాధల్లో ఉంటే ఇలాంటివి చేయడం సరైనదా కాదా అనేది నిర్ణయించుకోలేకపోతున్నారు.

Rishab Pant: ఆ ఫోటోలు వీడియోలు కుటుంబం పై ప్రభావం చూపుతాయి..

సదరు బాధితుల వ్యక్తుల ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయటం వల్ల ఆయన కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో ఆలోచించండి ఆయనకి ఓ కుటుంబం ఉంటుంది. కనీస జ్ఞానం కూడా లేకుండా ఇలా ప్రవర్తించడం చాలా సిగ్గుచేటు అంటూ రితిక ఈ సందర్భంగా రిషబ్ పంత్ ప్రమాద ఫోటోలు వీడియోలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago