Rishab Pant: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే.నూతన సంవత్సర వేడుకలను తన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపడం కోసం ఉత్తరాఖండ్ వెళ్తున్న సమయంలో ఈయన కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి రిషబ్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఈయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

ఇలా ఈయనకు ప్రమాదం జరగడంతో ఎంతోమంది అభిమానులు తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించడమే కాకుండా ఈయన ఆక్సిడెంట్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రిషబ్ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే రిషబ్ ప్రమాదానికి సంబంధించిన ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసే నేటిజనులపై క్రికెటర్ రోహిత్ సతీమణి రితికా సజ్దే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఈమె స్పందిస్తూ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసే వారిని చూస్తే చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఎవరైనా బాధల్లో ఉంటే ఇలాంటివి చేయడం సరైనదా కాదా అనేది నిర్ణయించుకోలేకపోతున్నారు.

Rishab Pant: ఆ ఫోటోలు వీడియోలు కుటుంబం పై ప్రభావం చూపుతాయి..
సదరు బాధితుల వ్యక్తుల ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయటం వల్ల ఆయన కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో ఆలోచించండి ఆయనకి ఓ కుటుంబం ఉంటుంది. కనీస జ్ఞానం కూడా లేకుండా ఇలా ప్రవర్తించడం చాలా సిగ్గుచేటు అంటూ రితిక ఈ సందర్భంగా రిషబ్ పంత్ ప్రమాద ఫోటోలు వీడియోలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.































