Featured

2023 year prediction : కొత్త సంవత్సరం భారత దేశానికి ఎలా ఉండనుంది… కరోనా కలకలం సృష్టిస్తుందా… జోతిష్యం ఏం చెబుతోంది..!

2023 year prediction : 2023 కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టగానే ఇక ఈ ఏడాది అందరికీ మంచి జరాగాలని అందరూ ఆశిస్తున్నారు. అసలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎలా ఉండనుందో జ్యోతిష్య ప్రముఖులు కళానిధి రాంబాబు గారు తెలిపారు. దేశానికి ఈ కొత్త ఏడాదిలో ఎలాంటి పరిణామలు చోటు చేసుకొనున్నాయి, కరోనా వ్యాపిస్తుందా, దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండనుంది అనే విషయాలను తెలుసుకుందాం.

ఈ ఏడాది కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా సాగనుంది…

జనవరి 1 కన్యాలగ్నంలో రావడం వలన లగ్నాధిపతి బుధుడు, చతుర్థస్థానంలో వ్యయ స్థానంలో ఉన్న రవి తో కలిసి ఉండడం వల్ల ప్రభలమైన బుధ ఆదిత్య యోగం ఏర్పడింది. ఇక గురు గ్రహం జన్మలగ్నాన్ని వీక్షించడం వల్ల బుధ ఆదిత్య యోగం వల్ల ప్రతికూల పరిస్థితులు ఉన్న గురువు శుభ లగ్నం అవ్వడం వల్ల మంచి ఫలితాలు కూడా ఉంటాయి. దేశ జాతకంలో ప్రజల ఆరోగ్యం, హోమ్ డిపార్ట్మెంట్, అనుకూలత వంటి పలు అంశాల మీద ప్రభావం కనిపిస్తుంది. ఇక గురు గ్రహం శుభ గ్రహం కావడం వల్ల ఈ ఏడాది ప్రజలు దైవ కార్యక్రమాలను ఎక్కువగా చేస్తారు. గురువు జ్ఞానము ప్రసాదించే గ్రహం కావడం వల్ల ఎక్కువగా పూజలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు ప్రజలు మొగ్గు చూపుతారు. ఇక భారత ఆర్థిక పరిస్థితి కూడా ఈ ఏడాది బాగుంటుంది. మరో శుభ గ్రహం శుక్రుడు కూడా కన్యాలగ్నంకు ద్వితీయ భాగాధిపతిగా ఉండటం వల్ల శుక్రుడు తన మిత్రుడు శనేశ్వరుడితో కలిసి ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి ఈ సంవత్సరం బాగా ఉన్నా ద్వితీయ స్థానంలో పాప గ్రహమైన కేతువు ప్రభావం వల్ల కొంత ఆర్థిక ప్రతికూలత ఉంటుంది, ప్రజలు డబ్బు విలువ తెలియకుండా ఉంటారు.

ఇక తృతీయ స్థానంలో కన్యాలగ్నం కు పాప గ్రహం అయిన కుజుడు ఉండటం వల్ల అది కూడా భాగ్య స్థానంలో ఉండటం వల్ల తృతీయ స్థానం టెలి కమ్యూనికేషన్ గురించి తెలుపుతుంది కాబట్టి ప్రింట్ మీడియా, మీడియా వారు కుంభకోణాలు వంటి వాటిని బయటపెడతారు, దీనివల్ల కొంతమంది రాజకీయ నాయకుల పదవులు పోవచ్చు అంటూ కళానిధి రాంబాబు గారు తెలిపారు. ఇక శనేశ్వరుడు స్వక్షేత్రం అయిన మకర రాశి లో పంచమ స్థానంలో ఉండటం వల్ల వ్యవసాయం, పంటలు బాగుంటాయి. అలానే రియల్ ఎస్టేట్ వారికి లాభదాయకంగా ఉండనుంది. ఇక కరోనా వంటి మహమ్మారి వచ్చినా ఇండియాలో ప్రాణ నష్టం ఉండక పోవచ్చు అంటూ తెలిపారు. ఇక ఈ సంవత్సరం ఆగస్టు వరకు కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆగస్టు తరువాత దేశ పరిస్థితులు బాగుంటాయి అంటూ తెలిపారు. మొత్తంగా చూసుకుంటే ప్రజలు డబ్బు తక్కువగా ఖర్చు చేసుకుంటూ పొదుపు పాటిస్తే ఈ ఏడాది చాలా బాగుంటుంది అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

ట్యాబ్లెట్ ఎలా వేసుకుంటున్నారు? ట్యాబ్లెట్లు వేసుకునే సరైన పద్ధతి తెలుసా? మందులు తీసుకునే టైమ్ ఎందుకు ముఖ్యం?

మనం రోజూ తీసుకునే మందుల విషయంలో చాలా చిన్న విషయాలను కూడా పట్టించుకోకపోవడం సాధారణం. ట్యాబ్లెట్‌ను నోట్లో వేసుకుని నీళ్లు…

24 minutes ago

వార్ట్స్‌తో ఇబ్బందా? ఇంట్లోనే సింపుల్ పరిష్కారాలు!

చర్మంపై చిన్నచిన్న ముడతల్లా కనిపించే వార్ట్స్ (warts) చాలామందికి సాధారణంగా ఎదురయ్యే సమస్య. ఇవి సాధారణంగా ప్రమాదకరమైనవి కాకపోయినా, కనిపించే…

54 minutes ago

అనాథగా జీవితం.. ఆకలి రోజులు.. ఇప్పుడు అందాల నటి

చిన్నప్పటి నుంచి సినిమాల్లో అడుగుపెట్టి, తర్వాత హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో తేజస్వి మదివాడఒకరు. తెరపై చలాకీగా కనిపించే ఆమె…

1 hour ago

ఐఎన్‌సీఏ అవార్డుల్లో తెలుగు సినిమాల జోరు.. నాగ చైతన్య, బుల్లిరాజులకు అవార్డులు!

ముంబైలో జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ అవార్డుల వేడుక సినీ ప్రముఖుల సందడితో అట్టహాసంగా జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ…

1 hour ago

పవన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. కటకటాల్లోకి కమెడియన్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిపవన్ కళ్యాణ్పై స్టాండప్ కామెడీ పేరుతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. అభ్యంతరకర వ్యాఖ్యలపై పోలీసులు…

1 hour ago

విడాకుల తర్వాత కొత్త జీవితం.. హన్సిక భావోద్వేగ వ్యాఖ్యలు..!

తెలుగు ప్రేక్షకులకు ‘దేశముదురు’ సినిమాతో పరిచయమైన అందాల హన్సిక మోత్వాని, తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తన…

1 hour ago