Featured

Ramesh Reddy : డబ్బులు ఎగ్గొట్టి నాకు నామం పెట్టినవాళ్లు చాలా మంది ఉన్నారు… విజయేంద్ర ప్రసాద్ గారు కథకి కారు అడిగారు : రమేష్ రెడ్డి

Ramesh Reddy : సినిమాల్లో నటుడుగా, రైటర్ గా ఇండస్ట్రీ లో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రమేష్ రెడ్డి గారు. ఎక్కువగా డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి సినిమాలకు పనిచేసిన రమేష్ రెడ్డి గారు హరీష్ శంకర్ కు బాగా సన్నిహితుడు. హరీష్ శంకర్ అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్నపటినుండి ఇద్దరికి పరిచయం ఉండటం వల్ల అప్పటి ఉండే ఇద్దరూ కలిసి పనిచేయాలని అనుకునేవారు. సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడే అది హిట్ అవుతుందో ప్లాప్ అవుతుందో రమేష్ రెడ్డి గారు చెప్పేస్తారట అందుకే అయనను రెబెల్ రమేష్ అని పిలుస్తారట. ఉన్నది ఉన్నట్లు చెప్పే రమేష్ రెడ్డి గారు దానివల్ల అవకాశాలు కూడా వదులుకున్నారు. ఇక వచ్చిన అవకాశాల్లో కూడా కొన్నింటికి పని చేయించుకుని డబ్బులు ఎగొట్టడాలు కూడా జరిగాయాంటూ రమేష్ రెడ్డి గారు తన అనుభవాలను పంచుకున్నారు.

విజయేంద్ర ప్రసాద్ గారు కథకి కారు అడిగారు…

రమేష్ రెడ్డి గారు ఆయన అనుభవాలను చెబుతూ ఒక డైరెక్టర్ అయన రాయించుకుంటున్న రైటర్ వెర్షన్ నచ్చక నాతో రాయించుకుని ఐదు లక్షలు ఇస్తానని చెప్పి ఇచ్చే సమయానికి చెప్పాపెట్టాకుండా చెన్నై వెళ్ళిపోయాడు. ఇదే విషయంలో వేరే రైటర్ కి జరుగుంటే అసోసియేషన్ లో ఫిర్యాధి లేకపోతే మీడియాలో మీటింగ్ జరిగేవి కానీ నేను అవేమి చేయలేదు వదిలేసాను. ఇక ఆ డైరెక్టర్ కు ఇపుడు పెద్ద అవకాశాలు కూడా లేక ఉన్నాడు. కానీ నేను ఫిర్యాదు చేయకపోయినా నాకు పని దొరుకుతుంది, డబ్బు పోయిండుచ్చు అంటూ చెప్పారు. ఇక రమేష్ గోపి ధ్వయం రైటర్స్ గా మంచి పేరు ఉంది. రమేష్ గారు ఇలా డబ్బు ఎగ్గొట్టినవారిని ఏమనుకుండా ఉంటే మరీ గోపి గారు ఎలా రమేష్ తో కలిసి పని చేసారనే సందేహం రాకమానదు. అయితే గోపి గారు కూడా అలాంటి మనసు కలవారే అంటూ రమేష్ చెప్పారు. ఐదేళ్ళ క్రితం ఒక డైరెక్టర్ ఇద్దరినీ డైలాగులు రాసుకురమ్మంటే గోపి ముందే రాసిచ్చాడు అయితే ఆ డైరెక్టర్ కు నచ్చలేదు. ఇక గోపి బాధపడి అతనిచ్చిన అడ్వాన్స్ వెనక్కి ఇవ్వడానికి సిద్ధాపడ్డాడు. అయితే ఆ నిమిషం నేను చెప్పాను ఇన్నేళ్లు రాసాము ఏ డైరెక్టర్ అయినా మన పని గురించి అన్నాడా ఒక కొత్త డైరెక్టర్ ఇవాళ ఏదో అన్నాడని డీలా పడితే ఎలా, అతనికి నచ్చలేదు అంతే ఇంకా నేను రాసిన వెర్షన్ ఉంది కదా అది చూద్దాం అని చెప్పాను.

ఇక విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పిన ఒక మాట నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఒక కథ లైన్ చెబితే బాగుంది అని అదే సమయంలో నేను రవిరాజా పినిశెట్టి వద్ద పనిచేస్తున్నాను దీంతో విజయేంద్ర ప్రసాద్ గారి కథ మా డైరెక్సటర్ కి ఇస్తానని అడిగాను. వెంకటేష్ గారితో సినిమా కోసం రవిరాజా గారు మంచి కథ కోసం చూస్తున్నారు. నేను చెప్పడం తో విజయేంద్ర ప్రసాద్ గారు సరె చెబుతాం కథ మీ డైరెక్టర్ కి అన్నారు. అయితే కారు పంపమని చెప్పండి అంటే ఇంకా సినిమా ఎమీ మొదలవలేదు, ప్రొడక్షన్ పని కూడా మొదలవలేదు అపుడే కారు అంటే ఎలా పంపుతారండీ అంటే ఆయన చెప్పారు కారు నాకోసమో, నీకోసమో కాదు ఈ కథకి. నీ పనికి నువ్వే గౌరవం ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు అని అన్నారు. అది జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అంటూ రమేష్ రెడ్డి గారు ఆయన అనుభవాలను చెప్పారు.

Bhargavi

Recent Posts

హీరోయిన్ అంటే ఆమెనే.. జయసుధ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…

1 minute ago

సినిమాల కంటే కుటుంబమే ముఖ్యం.. నాదియా షాకింగ్ రివీల్

తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…

10 minutes ago

మ్యాచ్‌కు ముందు కార్టూన్లు.. మైదానంలో రికార్డులు! సూర్యవంశీ స్టైల్

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…

3 hours ago

స్విమ్ సూట్ ఫోటోలు పంపినా ఛాన్స్ మిస్.. నటి షాకింగ్ రివీల్

సినిమా రంగంలో అవకాశాలు పొందడం మాత్రమే కాదు, వాటిని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమైన విషయం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే…

3 hours ago

ఓటు వేయడానికి వచ్చిన విజయ్.. పోలింగ్ కేంద్రంలో గందరగోళం

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ, ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఓటు హక్కు…

3 hours ago

కావాలనే ఇరికించారు.. మంగ్లీ సంచలన వ్యాఖ్యలు

మైక్రో ఫైనాన్స్ పేరిట వెలుగులోకి వచ్చిన ఆర్థిక మోసం కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పలువురిపై…

3 hours ago