Ramgopal Varma: రాంగోపాల్ వర్మ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే ఈయన సోషల్ మీడియా వేదికగా లేదా ఒక మీడియా సమావేశంలో పాల్గొన్న కూడా పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.వర్మ ఒక ట్వీట్ చేసిన లేదా ఒక కార్యక్రమంలో పాల్గొన్న తప్పనిసరిగా వివాదం చెలరేగుతుందనే విషయం అందరికీ తెలిసిందే.
ఇలా ఇప్పటికే ఎన్నో వివాదాలు ద్వారా వార్తల్లో నిలిచిన రామ్ గోపాల్ వర్మ తాజాగా రాజమౌళి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకోగా, RRR సినిమా ద్వారా ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.
ఈ క్రమంలోనే ఎంతోమంది హాలీవుడ్ దర్శకులు రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక తాజాగా అవతార్ సినిమా డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ సైతం రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ క్రమంలోనే వీరిద్దరికి సంబంధించిన వీడియోను రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ మిమ్మల్ని ఇలా చూస్తుంటే కొంతమంది డైరెక్టర్లు చాలా ఈర్షతో ఉన్నారు.
ఈ క్రమంలోనే కొందరు మీపై కుట్ర చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఇలా మీపై హత్యా ప్రయత్నం చేసే వారిలో తాను కూడా ఒకడని, అయితే నాకు 4 పెగ్గులు ఎక్కువ కావడం వల్ల ఈ నిజాలన్ని బయటకు వస్తున్నాయి అంటూ ఈయన షాకింగ్ ట్వీట్ చేశారు. ఇలా రాజమౌళి పై కుట్ర జరగబోతుందని కుట్ర చేసే వారిలో నేను కూడా ఒకరు మీరు మరింత భద్రత పెంచుకోవాలి అంటూ వర్మ చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే రాజమౌళి పై ఎలాంటి కుట్ర జరగదని ఇవి కేవలం వర్మ మాటలే అంటూ కొందరు కొట్టి పారేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…