Sudheer Varma: కుందనపు బొమ్మ సినిమా హీరో సుధీర్ వర్మ నిన్న వైజాగ్ లో కొన్ని కారణాలవల్ల ఆత్మహత్య చేసుకొని మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈయన మరణ వార్త తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదంగా మారింది.ఇలా సుధీర్ వర్మ మరణ వార్త తెలుసుకున్నటువంటి కొందరు ఈయనకు సంతాపం ప్రకటించారు. అయితే సుధీర్ వర్మ మరణ వార్త సోషల్ మీడియాలోనూ అలాగే కొన్ని న్యూస్ ఛానల్లో మరోలా స్పెండ్ అవుతుంది.
తెలుగు ఇండస్ట్రీలో హీరో సుధీర్ వర్మ మాత్రమే కాకుండా డైరెక్టర్ సుధీర్ వర్మ కూడా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈయన ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు.అయితే హీరో సుధీర్ వర్మ మరణించడంతో కొన్ని జాతీయ మీడియా సంస్థలు డైరెక్టర్ సుధీర్ వర్మ మరణించారని పెద్ద ఎత్తున వార్తలను ప్రచారం చేస్తున్నారు.
ఇలా డైరెక్టర్ సుధీర్ వర్మ చనిపోయారంటూ ఫొటోలను మార్చి ఏకంగా కొన్ని కథనాలు వెలబడటంతో ఒక్కసారిగా నేటిజన్స్ ఆశ్చర్యపోయారు.అయితే ఈ తప్పును గ్రహించిన కొన్ని మీడియా సంస్థలు తమ తప్పును సరిదిద్దుకోగా మరికొందరు మాత్రం రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర సినిమా డైరెక్టర్ సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్నారు అంటూ వార్తలు ప్రచారం చేస్తున్నారు.
ఈ విధంగా ఒక వ్యక్తి గురించి వార్త రాసేటప్పుడు ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకొని కథనాలు ప్రచురించాలని పొరపాటున తప్పు జరిగిన వెంటనే ఆ తప్పు సరిదిద్దుకోకుండా ఇలాగే తప్పుడు కథనాలను ప్రచారం చేయడం ఏంటి…. పేర్లు ఒకటైన మనుషులు వేరే కదా కాస్త చూసుకోవాలి కదా అంటూ నేటిజన్స్ సదురు మీడియా సంస్థలపై మండిపడుతున్నారు. ఇక డైరెక్టర్ సుధీర్ వర్మ ప్రస్తుతం రావణాసుర సినిమా పనులతో బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…