Ramgopal Varma: హైదరాబాద్ అంబర్ పేట్ వీధి కుక్కల ఘటన అందరిని ఎంతగానో కలిచి వేస్తోంది. ప్రదీప్ అనే చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేయడమే కాకుండా ఈ దాడిలో చిన్నారి మరణించడంతో ఒక్కసారిగా నగరం మొత్తం ఉలిక్కిపడింది.ఇలా ఈ చిన్నారి మరణించడంతో పలువురు ఈ ఘటన పై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఈ ఘటనపై వ్యవహరించిన తీరు పట్ల సంచలనాత్మక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్లు చేస్తూ మేయర్ విజయలక్ష్మిని టార్గెట్ చేశారు.ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ గతంలో విజయలక్ష్మి కుక్కలకు కుడి చేతితో అన్నం తిని పెడుతూ తాను ఎడమ చేతితో తింటున్నటువంటి వీడియోని షేర్ చేశారు.
ఈ వీడియోని షేర్ చేస్తూ మేయర్ గారికి కుక్కలు అంటే చాలా ప్రేమ ఉన్నట్టుంది. ఇలా వీధిలో కుక్కలన్నింటినీ తన ఇంటికి పంపించాలని వీటికి ఆమె అన్నం పెడితే అవి మన పిల్లలను తినవు అంటూ కామెంట్ చేశారు. అలాగే మరొక ట్వీట్ చేస్తూ… కుక్కలపై మేయర్ గారికి ఇంత ప్రేమ ఉంది కనుక నగరంలో ఉన్నటువంటి ఐదు లక్షల కుక్కలను తన ఇంటికి పంపించి మధ్యలో తనని కూర్చోబెడితే బాగుంటుంది అంటూ మరొక ట్వీట్ చేశారు.
ఇలా మేయర్ గురించి వర్మ చేసినటువంటి ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈయన మరొక వీడియోని షేర్ చేస్తూ మంత్రి కేటీఆర్ గారు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇంటికి ఐదువేల వీధి కుక్కలను పంపించాలి. ఇలా వీధి కుక్కలను విడిచి పెడితే ఆమె వాటిపై ఎంత ప్రేమ చూపిస్తారో చూడాలని ఈయన చెప్పుకొచ్చారు. ఈ వీడియో చివరిలో వర్మ మాట్లాడుతూ తనకు మహిళలంటే చాలా గౌరవం కానీ ఇప్పుడు మీ మీద అసలు గౌరవం లేదు అంటూ ఈ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం వర్మ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…