ఒక సినిమా విజయం విషయంలో కథ తో పాటు ఆ కథకు టైటిల్ కూడా అంతే పాత్రను పోషిస్తుంది. అలా ఒకే టైటిల్ తో వచ్చిన అనేక తెలుగు చిత్రాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, చిరంజీవి సినిమాలు ఒకే టైటిల్ తో(ఆరాధన) వచ్చాయి. అలాగే శోభన్ బాబు, చిరంజీవి (ముగ్గురు మొనగాళ్లు) ఒకే టైటిల్ తో ఉన్న సినిమాలు తీశారు. ఎన్టీ రామారావు, రాజశేఖర్(వేటగాడు) ఒకే టైటిల్ తో ఉన్న సినిమాలో నటించారు.
ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది. ఇకపోతే తండ్రి కొడుకులు ఒకే టైటిల్ తో ఉన్న సినిమాల్లో నటించడం అరుదు. అలా ఎన్టీ రామారావు, బాలకృష్ణ ఒకే టైటిల్ గల సినిమాలో నటించారు. దగ్గుబాటి రామానాయుడు సొంత గ్రామానికి షూటింగ్ నిమిత్తం వచ్చిన నాగేశ్వరరావు సలహా మేరకు ఆయన సినిమా రంగంలో అడుగు పెట్టారు. ఇతర వ్యాపారాలు చేసినప్పటికీ ఆయనకు నచ్చకపోవడంతో శ్రేయోభిలాషుల సలహా మేరకు ఒక సినిమాకి తక్కువ మొత్తంలో ఫైనాన్స్ చేయడం జరిగింది. అందులో నష్టం రావడంతో ఆయన తన బంధువులు, స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకొని మద్రాసు వచ్చారు. సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించి.. సినిమాలను నిర్మించడానికి సంసిద్ధులయ్యారు.
అలా ప్రయత్నించగా ఎన్టీరామారావు డేట్స్ దొరకాయి. ఆయనతో 1964లో సురేష్ ప్రొడక్షన్స్, డి.రామానాయుడు నిర్మాణం, తాపీచాణక్య దర్శకత్వంలో రాముడు భీముడు చిత్రం విడుదల అయ్యింది. ఎన్టీ రామారావు, జమున, ఎల్.విజయలక్ష్మి హీరో, హీరోయిన్లుగా నటించారు. ఎన్టీ రామారావు ద్విపాత్రాభినయం చేసిన మొదటి చిత్రం రాముడు భీముడు. ఈ సినిమా విజయవంతం అవడంతో హిందీలో ‘రామ్ ఔర్ శ్యామ్’ టైటిల్ తో పునర్ణిర్మించడం జరిగింది. అక్కడ విజయం సాధించడంతో.. మళ్లీ హిందీలో తిరిగి ‘సీత ఔర్ గీత’ గా రూపొందించబడింది.
1988 సత్యం సినీ ఎంటర్ప్రైజెస్, సిహెచ్ సత్యనారాయణ నిర్మాణం, మురళీ మోహన్ రావు దర్శకత్వంలో రాముడు భీముడు చిత్రం విడుదలయింది. ఈ సినిమాలో బాలకృష్ణ, రాధ, సుహాసిని హీరో హీరోయిన్లుగా నటించారు.
1964 లో ఎన్టీ రామారావు ద్విపాత్రాభినయంలో కనిపించిన ‘రాముడు భీముడు’ చిత్రం విజయవంతమవడంతో… తిరిగి చాలా సంవత్సరాల తర్వాత 1988 లో బాలయ్య బాబు ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రానికి ‘రాముడు భీముడు’ అనే టైటిల్ ని పెట్టడం జరిగింది. ఎన్టీ రామారావు నటించిన రాముడు భీముడు చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలువగా, బాలకృష్ణ నటించిన రాముడు భీముడు చిత్రం హిట్ చిత్రంగా నిలిచింది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…