Featured

Niharika- Drugs case: నిహారికకు సపోర్ట్ చేస్తున్న ట్రాన్స్ జెండర్.. ఆమె తప్పేం లేదంటూ!

Niharika- Drugs case: హైదరాబాద్‌లో పబ్ అండ్ పార్టీ కల్చర్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఈ భాగ్యనగరం డ్రగ్స్ వాడకానికి అడ్డాగా మారుతుందని అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మొన్నటికి మొన్న మత్తు పదార్థాలు తీసుకుంటున్న ఓ యువకుడు కళ్ల ముందే చనిపోవడం పోలీసులను సైతం కలచిపేసింది. కాగా ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ పబ్‌లో దాడులు నిర్వహించారు. ఇందులో సింగర్ రాహుల్ సిప్లీగంజ్, నిహారిక కొణిదెల సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ మారింది.

Niharika- Drugs case: మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్న బిగ్‌బాస్‌ ఫేమ్… నిహారిక తప్పు లేదంటూ కామెంట్స్!

ఇక్కడ ఇంకో ముఖ్య విషయమేమిటంటే పోలీసులు నిర్వహించిన దాడుల్లో నిహారిక కూడా ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో మెగా ఫ్యామిలీపై తీవ్ర స్థాయిలో చాలా మంది విమర్శలు చేస్తున్నారు. మరికొందరేమో పబ్‌కు వెళ్లినంత మాత్రానా మత్తు పదార్థాలు తీసుకున్నట్టా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు.. తన కూతురు తప్పేమీ లేదని ఆయన చెప్పారు. ఆ తర్వాత నిహారికకు పోలీసులు నోటీసులు జారీ చేసి, ఇంటికి పంపించేశారు. కానీ ఎప్పుడు కావల్సి వచ్చినా విచారణకు హాజరు కావల్సి ఉంటుందని ఆంక్షలు విధించారు.

Niharika- Drugs case: మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్న బిగ్‌బాస్‌ ఫేమ్… నిహారిక తప్పు లేదంటూ కామెంట్స్!

నిహారికను టార్గెట్‌ చేశారు….

ఇదిలా ఉండగా ఇదే విషయంపై బిగ్‌బాస్‌ ఫేమ్, ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి స్పందించారు. ఎవరో ఒకరు తప్పు చేస్తే అక్కడికి వారందరిని నిందితులుగా చూడడం తప్పని ఆమె వారించారు. నిహారిక కేవలం తన ఫ్రెండ్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ కోసమే పబ్‌కు వెళ్లిందని ఆమె చెప్పుకొచ్చారు. అయితే పబ్‌కు వెళ్లిన వాళ్లలో చాలా మంది ఉన్నా, వాళ్లందరినీ వదిలిపెట్టి నిహారికను మాత్రమే టార్గెట్‌ చేస్తున్నారని తమన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాదు నిహారిక డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు పోలీసులు ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. ఇలా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవారిని అడ్డుకుంటామని తమన్నా సింహాద్రి స్పష్టం చేశారు. ఇది దారుణమైన విషయంగా ఆమె పేర్కొన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago