Niharika- Drugs case: హైదరాబాద్‌లో పబ్ అండ్ పార్టీ కల్చర్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఈ భాగ్యనగరం డ్రగ్స్ వాడకానికి అడ్డాగా మారుతుందని అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మొన్నటికి మొన్న మత్తు పదార్థాలు తీసుకుంటున్న ఓ యువకుడు కళ్ల ముందే చనిపోవడం పోలీసులను సైతం కలచిపేసింది. కాగా ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ పబ్‌లో దాడులు నిర్వహించారు. ఇందులో సింగర్ రాహుల్ సిప్లీగంజ్, నిహారిక కొణిదెల సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ మారింది.

ఇక్కడ ఇంకో ముఖ్య విషయమేమిటంటే పోలీసులు నిర్వహించిన దాడుల్లో నిహారిక కూడా ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో మెగా ఫ్యామిలీపై తీవ్ర స్థాయిలో చాలా మంది విమర్శలు చేస్తున్నారు. మరికొందరేమో పబ్‌కు వెళ్లినంత మాత్రానా మత్తు పదార్థాలు తీసుకున్నట్టా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు.. తన కూతురు తప్పేమీ లేదని ఆయన చెప్పారు. ఆ తర్వాత నిహారికకు పోలీసులు నోటీసులు జారీ చేసి, ఇంటికి పంపించేశారు. కానీ ఎప్పుడు కావల్సి వచ్చినా విచారణకు హాజరు కావల్సి ఉంటుందని ఆంక్షలు విధించారు.

నిహారికను టార్గెట్ చేశారు….
ఇదిలా ఉండగా ఇదే విషయంపై బిగ్‌బాస్ ఫేమ్, ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి స్పందించారు. ఎవరో ఒకరు తప్పు చేస్తే అక్కడికి వారందరిని నిందితులుగా చూడడం తప్పని ఆమె వారించారు. నిహారిక కేవలం తన ఫ్రెండ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసమే పబ్‌కు వెళ్లిందని ఆమె చెప్పుకొచ్చారు. అయితే పబ్‌కు వెళ్లిన వాళ్లలో చాలా మంది ఉన్నా, వాళ్లందరినీ వదిలిపెట్టి నిహారికను మాత్రమే టార్గెట్ చేస్తున్నారని తమన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాదు నిహారిక డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పోలీసులు ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. ఇలా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవారిని అడ్డుకుంటామని తమన్నా సింహాద్రి స్పష్టం చేశారు. ఇది దారుణమైన విషయంగా ఆమె పేర్కొన్నారు.
































