టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ సినిమా అంటే అదో రేంజిలో ఉంటుంది. ఏ చిన్న అప్ డేట్ వచ్చినా తెగ వైరల్ అవుతుంటాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న భీమ్లానాయక్ నుంచి ఒక సాంగ్ విడుదల కాగా అది పెద్ద వైరల్ గా మారింది. కొన్ని మిలియన్లకొద్ది వ్యూస్ కూడా సొంతం చేసుకుంది. ఆ వీడియో యూట్యూబ్ లో పెట్టిన కొన్ని గంటల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి.
అయితే ఆ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చేసింది. అందేంటంటే.. ఈ సినిమాలో దగ్గుపాటి రానా నటిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో డానియల్ శేఖర్‌గా రానా నటిస్తున్నారు. అయితే తాజాగా రానా రోల్ ఫస్ట్ గ్లింప్స్ ఓ వీడియోను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో రానా పంచె ధరించి పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించి మాస్ ఆడియన్స్ కి కేక పుట్టించారు.
అంతేకాదు నిత్యామీనన్‌కు భారీ వార్నింగ్ కూడా ఇచ్చారు. నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటా.. స్టేషన్లో టాక్ నడుస్తోంది.. నేనేవరో తెలుసా.. ధర్మేంద్ర.. హీరో అంటూ రానా చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. తర్వాత బ్లాక్ షర్ట్ లో కారుపై నిల్చొని ‘డాని ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నంబర్ 1’ అంటూ రానా దద్దరిల్లిపోయేలా డైలాగ్స్ చెబుతాడు. దీంతో అభిమానుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి.
ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. దీనికి సంగీతం తమన్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పవన్‌కు జోడిగా నిత్యా మీనన్ నటిస్తుండగా.. రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నట్లుగా టాక్. దీనిని 2022 సంక్రాంతికి విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు చిత్ర బృందం. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…