Rana: దగ్గుబాటి వారసుడిగా లీడర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కథ ప్రాధాన్యత ఉన్నటువంటి సినిమాలలో హీరోగాను విలన్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
బాహుబలి సినిమా ద్వారా తరువాత పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా పాన్ ఇండియా హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రానా కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నారు. కెరియర్ విషయాన్ని గురించి పక్కన పెడితే ఈయన వ్యక్తిగత జీవితం గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతుంది.
రానా 2020 వ సంవత్సరంలో మిహికా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఇలా వీరి పెళ్లి అయినప్పటి నుంచి వీరి గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను మీహీక ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. ఇక వీరి పిల్లల గురించి కూడా ఏదో ఒక వార్త వినపడుతూనే ఉంది.
రానా దంపతులకు పెళ్లయి మూడు సంవత్సరాలు అవుతున్న పిల్లలు లేకపోవడంతో పిల్లల గురించి కూడా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా పిల్లల విషయంలో ఈ దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. రానా దంపతులు పిల్లలను కనకుండా, అనాధ పిల్లలను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులందరూ షాక్ అయ్యారని తెలుస్తోంది.మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…