Rashi Khanna: ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ రాశి కన్నా. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశికన్నా తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత సుప్రీమ్, బెంగాల్ టైగర్, జై లవ కుశ వంటి తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా తమిళ్, మలయాళీ భాషలలో ఎందరో స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది.
ఇలా హిట్ ప్లాట్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న రాశీ కన్నా స్టార్ హీరోయిన్ గా మాత్రం గుర్తింపు సొంతం చేసుకోలేక పోతోంది. కెరీర్ ఆరంభంలో కొంచం బొద్దుగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు కొంచం సన్నబడి నాజూగ్గా తయారైంది.దీంతో తెలుగు, తమిళ్ భాషలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ నుండి కూడా అవకాశాలు అందుకుంటుంది.
తాజాగా ఒక వెబ్ సిరీస్ ద్వారా ఈ అమ్మడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఒక హింది రెండు తమిళ్ చిత్రాలలో నటిస్తూ ఈ అమ్మడు బిజీగా ఉంది.
ఇదిలా ఉండగా తాజాగా ఈ అమ్మడి గురించి ఒక వార్త బయటికి వచ్చింది.కెరీర్ ప్రారంభంలో ఒక సినిమాకి ఆడిషన్ ఇవ్వటానికి వచ్చిన రాశి ఖన్నా ఆడిషన్ ఇవ్వకుండానే అక్కడినుండి భయంతో పారిపోయినట్లు తెలుస్తోంది.
ఊహలు గుసగుసలాడే సినిమా కన్నా ముందు రాసి కన్నా మద్రాస్ కేఫ్ అనే హిందీ సినిమాలో నటించింది. అయితే ఆ సినిమాకి ఆడిషన్ ఇవ్వటానికి వచ్చిన రాశి కన్నా ఆ సమయంలో చాలా మంది సెలబ్రిటీల మధ్య ఆడిషన్ ఇచ్చే ధైర్యం లేక.. వాళ్ళందరిని చూసి పారిపోయిందట. ఆ తర్వాత నటన మీదున్న గౌరవంతో తిరిగి వచ్చి ఆడిషన్ ఇచ్చిందట. అయితే ఆ సినిమాకు రాశీ కన్నా సెలెక్ట్ అయ్యిందనీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…