Anchor Sreemukhi: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా గుర్తింపు పొందిన శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర మీద తన యాంకరింగ్ తో పాటు గ్లామర్ తో కూడా ప్రేక్షకులను అలరిస్తున్న శ్రీముఖి ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. చానల్ తో సంబంధం లేకుండా బుల్లితెర మీద ప్రసారమవుతున్న అన్ని టీవీ షోలలో యాంకర్ గా సందడి చేస్తున్న శ్రీముఖి క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతోంది.
ఈ క్రమంలో ఆమె పారితోషికం కూడా భారీగానే పెంచేస్తోంది. సుమ, రష్మి తర్వాత మూడవ స్థానంలో కొనసాగుతున్న శ్రీముఖి లక్షల్లో పారితోషికం అందుకుంటుంది. బుల్లితెర వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఒక్కో షోకి శ్రీముఖి దాదాపు రూ. 1.5 నుండి 2 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రస్తుతం మూడు నాలుగు టీవీ షోలు శ్రీముఖి చేతిలో ఉన్నాయి.
ఇలా వరుస టీవీ షోలో యాంకర్ గా సందడి చేయడమే కాకుండా సినిమాలలో కూడా నటిస్తూ అటు వెండితెర మీద కూడా సందడి చేస్తోంది. ఇప్పటికే ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటించిన శ్రీముఖి ఇటీవల విడుదలైన క్రేజీ అంకుల్స్ సినిమాలో హీరోయిన్గా అవతారం ఎక్కింది. అయితే ఆ సినిమా కమర్షియల్ గా అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర సినిమాలో శ్రీముఖి కీలక పాత్రలో నటిస్తోంది.
ఇక ఇలా టీవీ షోలు, సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండే శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన టీవీ షోలు, సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ని అభిమానులతో పంచుకోవటమే కాకుండా తన గ్లామర్ ఫోటోలు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. బొద్దుగా ముద్దుగా ఉండే శ్రీముఖి ఇప్పుడు కొంచం సన్నబడి నాజూగ్గా తయారై అందాలతో రచ్చ చేస్తోంది.
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…