Sudheer -Rashmi: ఆ టైంలో హగ్ చేసుకొని ఏడ్చామంటూ తమ రిలేషన్ పై స్పందించిన రష్మీ.. సుధీర్!
Sudheer -Rashmi: సుడిగాలి సుదీర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభం అయినప్పటి నుంచి వీరి మధ్య అనుబంధం గత కొన్ని సంవత్సరాల నుంచి ఇలాగే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ జంటకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇలా వీరిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉండటంతో చాలామంది వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని వీరు పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది అంటూ వారి అభిప్రాయాలను తెలియజేశారు.
ఇలా ప్రతిసారి సుధీర్ రష్మీ మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు ఆరా తీస్తూ వచ్చారు. అయితే ఎప్పుడు వీరి రిలేషన్ గురించి పెద్దగా స్పందించలేదు. మొదటిసారిగా ఈ జంట ఈ టీవీ లో కాకుండా స్టార్ మాలో సందడి చేశారు. హోలీ పండుగ సందర్భంగా స్టార్ మా ఈ హోలీకి తగ్గేదే లే అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుధీర్ ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు.
సుధీర్ ఎంటర్ అయిన తర్వాత రష్మీ పై ఎంతో ప్రేమ కనబరుస్తూ ఆమె గురించి పాటలు పాడటంతో రష్మి ఎమోషనల్ అయ్యారు.ఇక ఈ కార్యక్రమం సందర్భంగా రష్మి సుడిగాలి సుధీర్ తో కలిసి గొడవ పడిన విషయం గురించి ప్రస్తావించడమే కాకుండా వారి మధ్య ఉన్న రిలేషన్ గురించి కూడా ఓపెన్ అయ్యారు.
సుడిగాలి సుధీర్ రష్మీ కలిసి పలు స్కిట్ లో సందడి చేస్తారనే విషయం మనకు తెలిసిందే.ఈ విధంగా సుడిగాలి సుధీర్ స్కిట్ విషయంలో తప్పుగా అర్థం చేసుకున్న రష్మి దాదాపు ఎనిమిది నెలల వీరిద్దరు మాట్లాడుకోవడం లేదని ఈ కార్యక్రమంలో తెలిపారు. అయితే నాకు ఎంతో ఇష్టమైన స్వీట్ పంపించి తనని కూల్ చేశారని రష్మీ ఈ కార్యక్రమం సందర్భంగా తెలియజేశారు.
ఈ విధంగా ఈ స్వీట్ పంపించడంతో ఇద్దరం కలిసి ఏడవడమే కాకుండా గట్టిగా హగ్ చేసుకున్నామని, ఈ గొడవ తర్వాత మేమిద్దరం ఎప్పుడు గొడవ పడింది లేదని రష్మి ఈ కార్యక్రమం సందర్భంగా వారి మధ్య ఉన్న రిలేషన్ గురించి ఓపెన్ అయ్యారు.మా గురించి ఎవరు ఏమనుకున్నా మేంటో మా రిలేషన్ ఏంటో మాకు తెలుసు అడిగిన ప్రతిసారీ ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదని ఈ సందర్భంగా రష్మి వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…