రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ చిత్రంగా అత్యంత భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. గత రెండేళ్లుగా ఎన్నో కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ పిరియాడిక్ మల్టీస్టారర్ ఎట్టకేలకు మార్చి 25 న విడుదలకు సిద్దమైంది. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్. టీం అందరూ ప్రమోషన్స్ లో యమ బిజీగా గడిపోస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి దేశమంతా తిరిగేస్తూ సినిమాపై మరింత అంచనాలు పెంచేస్తున్నారు.
ఇంత భారీ అంచనాల నడుమ మరో రెండు రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమా ఎటువంటి ప్రభంజనాలు సృష్టిస్తుందో అనే విషయం సర్వత్రా ఆశక్తిగా మారింది. ఈ నేపధ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమాపై మూడురోజుల ముందుగానే సినీ విమర్శకుడు, ఓవర్ సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధూ రివ్యూ ఇచ్చారు. అంతేకాదు సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయం అంటూ ఫైవ్ స్టార్ రేటింగ్ కూడా ఇచ్చాడు.
‘అందరూ గర్వపడేలా ఈ సినిమా ఉందని, ఇండియన్ సినిమా గొప్ప కలలు కనడమే కాదు, వాటిని సాకారం చేసుకోవచ్చని నిరూపించింది ఆర్ఆర్ఆర్ చిత్రం. ఈ చిత్రాన్ని అందరూ మిస్ అవ్వకుండా చూసి తీరాల్సిందే! ఇప్పుడు ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అని చెప్పుకున్నా రేపటి తరానికి ఈ సినిమా ఒక క్లాసిక్‌గా మిగిలిపోతుంది అంటూ తన ట్విటర్‌లో రాసుకొచ్చాడు.
ఇక పెర్ఫామెన్స్ విషయానికి వస్తే.. సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ అద్భుతంగా ఉందని, వీరిద్దరి నటన కూడా అడిరిందని, మరో కీలక పాత్రలో నటించిన అజయ్ దేవ్‌గణ్ కూడా ఒక సర్‌ప్రైజ్ ప్యాకేజీలా కనిపిస్తాడు. ఇక హీరోయిన్ ఆలియా భట్ ఈ సినిమాలో మరింత అందంగా కనిపిస్తుంది’ అని ఉమైర్ సంధు ట్వీట్ చేసాడు.. ఇక ఈ సినిమా తరువాత రాజమౌళి ఇండియాలోనే నెంబర్ 1 డైరెక్టర్‌గా మారిపోతాడని డైరెక్టర్ రాజమౌళీపై ప్రశంసల జల్లు కురిపిస్తూ మరో ట్వీట్ చేశాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…