Anchor Rashmi: ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు బుల్లితెరపై ఎన్నో ప్రత్యేకమైన కార్యక్రమాల ద్వారా బుల్లితెర ఆర్టిస్టులందరూ ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమవుతారు.ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ సందర్భంగా ఈటీవీలో అమ్మమ్మగారి ఊరు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సీరియల్ ఆర్టిస్ట్ లు, జబర్దస్త్ కమెడియన్స్,సీనియర్ నటీనటులు పాల్గొని ఎంతో వినోదాన్ని పంచినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమ్మమ్మగారి ఊరు అనే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమోలో భాగంగా బుల్లితెర యాంకర్ రష్మీ తనదైన శైలిలో సమంత ఐటమ్ సాంగ్ కి అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చేసింది.ఊ అంటావా మామ అంటూ రష్మి సెగలు పుట్టిస్తూ డాన్స్ చేయడంతో హైపర్ ఆది తనదైన శైలిలో రష్మీ పర్ఫామెన్స్ పై సెటైర్ వేశారు.
ఇలా రష్మీ ఈ పాటకు డాన్స్ చేస్తూ ఉండగా హైపర్ ఆది స్పందిస్తూ రష్మీ చేస్తే ఎవరైనా ఉ.. అనాల్సిందే అంటూ హైపర్ ఆది తనదైన శైలిలో పంచ్ వేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి కార్యక్రమం చూస్తూ మరింత వినోదాన్ని ఆస్వాదించాలి అంటే సంక్రాంతి పండుగ వరకు వేచి చూడాల్సిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…