Rashmi Gowtham : జబర్దస్త్ తరువాత ఈటీవీలో మంచి టీఆర్పి ప్రేక్షకాధరణతో సాగుతున్న షో శ్రీదేవి డ్రామా కంపెనీ. సుధీర్ యాంకర్ గా, ఇంద్రజ జడ్జిగా వస్తోన్న ఈ షో చాలా తక్కువ సమయంలోనే మంచి హిట్ గా నిలిచింది. కామన్ పీపుల్ టాలెంట్ ఈ షో ద్వారా పరిచయం చేస్తుంటారు. సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల సుధీర్ ఈ షో కి హోస్ట్ గా తప్పుకున్నాడు. ఇక ఇంద్రజ కూడా ప్రస్తుతం జబర్దస్త్ జడ్జిగా వస్తున్నారు. కారణాలు ఖచ్చితంగా తెలియకపోయిన ప్రస్తుతం వీళ్ళు ఇద్దరు శ్రీదేవి డ్రామా కంపెనీ కి రావడం లేదు.
అసహనానికి గురిచేస్తున్న టీఆర్పి స్టంట్స్…..
ఇపుడు సుధీర్ ప్లేసులో రష్మీని శ్రీదేవి డ్రామా కంపెనీ కి హోస్ట్ గా తీసుకున్నారు. ఇక పూర్ణ జడ్జిగా కనువిందు చేసింది. అయితే షో టీఆర్పి కోసం ఏదైనా ఎమోషనల్ గా చేయాలి అంటూ రామ్ ప్రసాద్ అనడం నేటి ప్రోమోలో తెలుస్తుంది. ఇక రామ్ ప్రసాద్ అలా అనగానే రష్మీ కళ్ళు తిరిగి పడిపోవడంతో అందరు ఒక్కసారిగా టెన్షన్ పడతారు. ఇక కాసేపటికి ఇదంతా టీఆర్పి కోసం అనగానే జడ్జిగా ఉన్న పూర్ణ స్టేజి పైకి వచ్చి రష్మీతో మాట్లాడుతుండగా ఇమ్మానుయేల్ పూర్ణను తాకడంతో ఇమ్మానుయేల్ ను పూర్ణ తిడుతుంది. ఇక ఒక్కసారిగా వాతావరణం హీటేక్కింది. ఆ తరువాత ఇది ప్రాంక్ అని పూర్ణ చెప్పడంతో అందరు ఊపిరి తీసుకున్నారు. ఇక్కడితో ఆపకుండా రీతూ చౌదరిని నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తి ఎవరు అని అడగడంతో హైపర్ ఆదికి ప్రపోజ్ చేస్తుంది.
చెంప దెబ్బ కొట్టిన రష్మీ…..
ఇక హైపర్ ఆది రీతూ ప్రపోసల్ ను తిరస్కరించడంతో రీతూ స్టేజి నుండి వెళ్ళిపోతుంది. ఇక రష్మీ ఆవేశంగా వచ్చి హైపర్ ఆది చెంప పగులగొడుతుంది. నువ్వసలు మనిషివా, పశువ్వా ఒక అమ్మాయి మనసుని విరిచేస్తావా అంటూ ఆవేశంగా అంటూ నవ్వేస్తుంది ఇక ఈ మాట నన్ను కాదు బాబు అడిగావా ఎపుడైనా అంటూ ఆది, రష్మీపై పంచులేస్తాడు. ఇక రీతూ చౌదరి మళ్ళీ వేదికపైకి వచ్చి ఆది అమ్మాయిలను ఎంతో గౌరవిస్తాడంటూ చెప్పుకోస్తుంది. అలా శ్రీదేవి డ్రామా కంపెనీ టీఆర్పి స్టంట్స్ చేస్తూ ప్రేక్షకులకు మాత్రం విసుగుపుట్టిస్తున్నారు. ప్రోమోకి కామెంట్స్ మాత్రం బాగా ట్రోల్ చేస్తూ వస్తున్నాయి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…