Rashmi: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రష్మీ కేవలం ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి మాత్రమే కాకుండా,ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ కార్యక్రమానికి మొదట్లో బుల్లితెర సీరియల్ నటుడు అంబంటి అర్జున్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఇలా ఈయన వ్యాఖ్యాతగా ఉన్న సమయంలో ఈ కార్యక్రమానికి పెద్దగా ఆదరణ రాలేదని చెప్పాలి. అయితే ఈ కార్యక్రమానికి రేటింగ్ రాకపోవడంతో అంబంటి అర్జున్ స్థానంలో యాంకర్ గా సుడిగాలి సుదీర్ ను నియమించారు. ఇలా సుదీర్ వ్యాఖ్యాతగా ఈ కార్యక్రమాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లారు అని చెప్పాలి.
ఇక కొంతకాలం పాటు సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన అనంతరం ఈ కార్యక్రమం నుంచి సుధీర్ బయటకు వెళ్లిపోవడంతో ఈ స్థానంలోకి రష్మీ యాంకర్ గా వచ్చారు. అయితే ఈమె ఈ కార్యక్రమానికి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి ఏడాది పూర్తి కావడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు రష్మికి విభిన్న రకాలుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ విధంగా అభిమానులు రష్మికి శుభాకాంక్షలు తెలియజేయడంతో ఈమె కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఈ క్రమంలోనే రష్మీ సందిస్తూ ప్రతి ఆదివారం ప్రసారమవుతున్నటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఎంతో మంచిగా ఆదరిస్తున్నందుకు ఈమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని కోరుకున్నారు. అలాగే తమ నుంచి ఏదైనా తప్పు జరిగిన తమని క్షమించాలి అంటూ ఈ సందర్భంగా రష్మి చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…