Movie News

Anasuya: మనిద్దరం పర్ఫెక్ట్ కాదని నాకు తెలుసు… భర్త గురించి ఎమోషనల్ పోస్ట్ చేసిన అనసూయ!

Anasuya: యాంకర్ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ఈమె ప్రస్తుతం తన భర్తతో కలిసి బ్యాంకాక్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా బ్యాంకాక్ పర్యటనలో ఉన్నటువంటి అనసూయ తరచు తన వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఇక అనసూయ జూన్ 4వ తేదీ వారి పెళ్లి రోజు కావడంతో తన భర్తతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన భర్త పై ఉన్నటువంటి ప్రేమను తెలుపుతూ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ నువ్వు నాకు మొదటిసారి ఇచ్చిన ప్రేమలేఖ ఇప్పటికీ గుర్తుంది. న్యూఢిల్లీ ఆడిటోరియంలో నాకు ఆ ప్రేమ లేక ఇచ్చావు బహుశా ఇప్పటివరకు నేను రిప్లై ఇవ్వలేదు.

ఈరోజు ఇలా రిప్లై ఇస్తున్నానంటూ ఈమె ఒక సుదీర్ఘమైన పోస్ట్ రాసుకోచ్చారు. ఇన్ని రోజులు నా జీవితంలో ఎంతో సంతోషాన్ని నింపినందుకు ధన్యవాదాలు. నాకోసం చాలా త్యాగాలు చేశావు. ఎన్ని అవమానాలు ఎదురైనా.. మన ప్రేమ దేవాలయానికి నువ్వు ఓ పిల్లర్‌లాగా నిలిచావు. ఇప్పుడు మనం కలిసి ఎదుగుతున్నాం. ఇన్నేళ్లు నువ్వు నన్ను ఎలా భరించావో నాకు తెలియడం లేదు. నేను కూడా నిన్ను ఎలా భరించానో అర్థం కావడం లేదు.


Anasuya: ఒకరి కోసం ఒకరు లేము…


మనిద్దరం పర్ఫెక్ట్ జంట కాదని నాకు తెలుసు మనిద్దరం చాలా మూర్ఖులం.కొన్నిసార్లు ఒకరి పట్ల మరొకరు చాలా దారుణంగా ఉన్నాము అలాగే కొన్ని సమయాలలో ఒకరి కోసం ఒకరు నిలబడలేకపోయాం. మన పెళ్లిని ఓ డేటింగ్‌ లాగా చేసిన నీకు థ్యాంక్స్‌. పెళ్లి రోజు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. ఈ పోస్టులో ఓ వీడియో ఆమె షేర్‌ చేశారు. ఇలా అనసూయ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago