Rashmika: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి పరిచయమైన వారిలో నటి రష్మిక ఒకరు. ఈమె కన్నడ చిత్ర పరిశ్రమలో తెరకెక్కిన కిరిక్ పార్టీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఈ సినిమాతో ఎంతో మంచి విజయాన్ని అందుకున్న రష్మికకు తెలుగు తమిళ భాషలతో పాటు హిందీ భాషలో కూడా సినిమాలలో నటించే అవకాశాలు వస్తున్నాయి.
ఇక ఈమెకు కిరిక్ పార్టీ సినిమాలో హీరో రక్షిత్ శెట్టి అవకాశం కల్పించగా ఈ సినిమాకు డైరెక్టర్ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. ఇలా తనకు లైఫ్ ఇచ్చిన వీరిద్దరిపై రష్మిక ఇదివరకు ఎన్నో సార్లు విమర్శలు చేశారు. ఇక గత ఏడాది విడుదలైన కాంతార సినిమా గురించి రష్మిక చేసినటువంటి కామెంట్స్ తీవ్ర వివాదాలను సృష్టించడమే కాకుండా ఒకానొక దశలో ఈమెను కన్నడ చిత్ర పరిశ్రమ బ్యాన్ చేసిందని వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి.
ఇలా తన గురించి ఎన్నోసార్లు ఈ విధమైనటువంటి నెగిటివ్ వార్తలు రావడంతో రష్మిక స్పందించి వాటిని తిప్పి కొట్టడమే కాకుండా ఇక సహించేది లేదంటూ ట్రోలర్స్ కు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఇక కాంతార సినిమా విషయంలో రిషబ్ శెట్టి రష్మిక మధ్య కొంత పాటి వివాదం తలెత్తింది.
తాజాగా రష్మిక సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ రిషబ్ శెట్టి నటుడు రక్షిత్ శెట్టి గురించి పాజిటివ్ గా స్పందించి కామెంట్లు చేయడంతో ఈ విషయం కాస్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.తాను ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు గల కారణం రిషబ్ శెట్టి రక్షిత్ శెట్టి వీరిద్దరే కారణమంటూ రష్మిక చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…