Rashmika: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చినటువంటి చిత్రం లైగర్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ ఆ అంచనాలను చేరుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ సినిమా చూసినటువంటి విజయ్ అభిమానులు సైతం ఈ సినిమా విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించి సినిమాపై భారీ అంచనాలు పెంచడంతో భారీ ధరలకు బయ్యర్లు సినిమాని కొనుగోలు చేశారు.దీంతో సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో తీవ్రస్థాయిలో బయ్యర్లు నష్టపోయారు.
ఇక ఈ సినిమా గురించి అందరూ మర్చిపోయినప్పటికీ తాజాగా రష్మిక లైగర్ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఈమె హిందీలో నటించిన గుడ్ బై సినిమా అక్టోబర్ 7వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రష్మిక లైగర్ సినిమా గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లైగర్ సినిమా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ తనకు మాత్రం పిచ్చిపిచ్చిగా నచ్చిందని ఈ సినిమా చూస్తున్నంత సేపు గట్టిగా విజిల్స్ వేయడమే కాకుండా డాన్స్ కూడా చేశాను అంటూ ఈ సందర్భంగా రష్మిక ఈ సినిమా గురించి షాకింగ్ కామెంట్ చేశారు.తనకు హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేదు మాస్ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని అందుకే లైగర్ సినిమా కూడా తనకు చాలా బాగా నచ్చిందని ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో మరోసారి విజయ్ దేవరకొండ రష్మిక రిలేషన్ గురించి నేటిజన్స్ చర్చించుకుంటున్నారు.విజయ్ దేవరకొండ సినిమా కాబట్టి ఫ్లాప్ అయినా ఈ సినిమా తనకు నచ్చిందంటూ రష్మిక కామెంట్లు చేస్తున్నారని నేటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…