Rashmika: రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఇలా వరుస షూటింగ్ లతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి రష్మిక కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో ప్రేమలో పడిన విషయం మనకు తెలిసిందే. ఇలా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని భావించారు.
ఇలా పెద్దల సమక్షంలో సినీ సెలబ్రిటీల సమక్షంలో వీరిద్దరూ 2017 వ సంవత్సరంలో ఎంతో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. అయితే నిశ్చితార్థం జరిగిన కొంత కాలానికి వీరిద్దరూ తమ ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారు. ఇలా బ్రేకప్ చెప్పుకున్నటువంటి రష్మిక తిరిగి తన సినీ కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇకపోతే రష్మిక తన ప్రియుడు రక్షిత్ తోబ్రేకప్ చెప్పుకోవడానికి గల కారణం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వీరిద్దరూ విడిపోవడానికి వేణు స్వామి చెప్పిన జాతకమే కారణమని సమాచారం. రష్మిక వేణు స్వామిని ఎంతగా నమ్ముతారో మనకు తెలిసిందే. ఈయన చేత ఈమె ప్రత్యేకంగా పూజలు కూడా చేయించారు. అయితే రష్మిక రక్షిత్ జాతకం చూసినటువంటి వేణు స్వామి పెళ్లి చేసుకోకపోవడమే మంచిదని చెప్పారట.
ఇద్దరు పెళ్లి చేసుకుంటే కనుక ఎక్కువ కాలం కలిసి ఉండలేరని విడిపోతారని చెప్పడమే కాకుండా రష్మిక సినీ కెరియర్ కూడా ఆగిపోతుందని చెప్పడంతో రష్మిక రక్షిత్ తో బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తుంది.ఇలా వేణు స్వామి చెప్పిన జాతకం కారణంగానే రష్మిక బ్రేకప్ జరిగిందని దీంతో ఈమె సినిమాలపై ఫోకస్ పెట్టి పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందారని తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…