Featured

Sarpanch Navya : ఎమ్మెల్యే రాజయ్య చీకటి బాగోతం ఇదే…: సర్పంచ్ నవ్య

Sarpanch Navya : వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురంలోని సర్పంచ్ నవ్య ప్రవీణ్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య మీద మరోసారి ఆరోపణలను చేసారు నవ్య. గతంలో నవ్య తన మీద ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించగా మీడియా, ప్రజాసంఘాల ఒత్తిడి మేరకు రాజయ్య గారు ఆమె ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పి నవ్య కుటుంబంతో మాట్లాడారు. అనంతరం సర్పంచ్ నవ్య, ఆమె భర్త ప్రవీణ్ తో కలిసి రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ఇపుడు తాజాగా మరోసారి నవ్య మీడియా ముందుకు వచ్చారు. 25 లక్షలు ఇస్తానని రాజయ్య మోసం చేసాడని తన భర్తను కూడా బుట్టలో వేసుకున్నాడంటూ ఆరోపిస్తున్నారు.

నా భర్త ద్వారా నన్ను టార్చర్ చేస్తున్నారు…

20 లక్షలు ఆశ చూపి నా భర్తని ట్రాప్ చేశారని మొదటి నుండి నాకు సపోర్ట్ గా ఉన్న నా భర్త ఇప్పుడు ఎమ్మెల్యే చేప్పినట్లు చేయమని చెప్తున్నాడు. సంతకం చేయాలని ఎమ్మెల్యే నా భర్త ద్వారా ఒత్తిడి తెస్తున్నాడు అంటూ చెప్పారు. గతంలో ఆరోపణలు చేసినపుడు ఎమ్మెల్యే ఇంటికి వచ్చి క్షమాపణలు చెప్పారు. ఆ సమయంలో తనకు రాజీ పడాలని లేకపోయినా మధ్యలో వాళ్ళు బలవంతంగా ఓప్పించారని చెప్పారు నవ్య.

ఇక గ్రామంలో ఎమ్మెల్యే రాజీ పడటానికి 25 లక్షలు ఇచ్చినట్లు అలాగే హైదరాబాద్ లో ఇల్లు కొన్నానంటూ పుకార్లు సృష్టించారు. అభివృద్ధి పనుల కోసం డబ్బు ఇస్తానని చెప్పారే కానీ ఇంకే డబ్బు నేను తీసుకోలేదు. నా వ్యక్తిత్వాన్ని అమ్ముకుని డబ్బు తీసుకునే క్యారెక్టర్ కాదు నాది అంటూ నవ్య ఫైర్ అయ్యారు. నా భర్త 20 లక్షల కోసం నాతో సంతకం చేయించాలని అనుకుంటున్నాడు. భవిష్యత్ లో ముప్పై లక్షలు ఇస్తామంటే చంపేసినా చంపేస్తాడు. ఎమ్మెల్యే, ఒక మహిళా అధికారి ద్వారా నా భర్తని ట్రాప్ చేసారు అంటూ నవ్య ఫైర్ అయ్యారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago