Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక ఇటీవల జపాన్ వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.
తాజాగా టోక్యోలో జరిగిన క్రంచీ రోల్ అనిమే అవార్డ్స్ వేడుకలలో పాల్గొంది. ఈ ఈవెంట్ కు హాజరైన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో తాజాగా పింక్ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక తన అప్ కమింగ్ మూవీస్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె పుష్ప 2 గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పుష్ప సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాలుగా చిత్ర బృందంతో కలిసి తాను కలిసి షూటింగ్లో పాల్గొనడం గురించి ఆసక్తికర విషయాలు తెలిపారుని రోజులు నేను పుష్ప రాజ్ ప్రేయసిగా మాత్రమే ఉన్నాను అయితే ఇప్పుడు మాత్రం పుష్ప భార్య. అది చాలా బాధ్యతలతో నిండి ఉన్న పాత్ర. సీక్వెల్ లో చాలా ఎక్కువ డ్రామా, పాత్రల సంఘర్షణలు ఉన్నాయి. అలాగే ఈ లో ఎక్కువగా మసాలా ఉంటుందని తెలిపారు.
భార్యగా నాపై బాధ్యతలు పెరిగాయి…
డైరెక్టర్ సుకుమార్ వంటి పర్ఫెక్షనిస్ట్ దర్శకుడితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని.. పుష్ప 2 పై ప్రేక్షకులకు ఎన్నో అంచనాలు ఉన్నాయని అయితే ఆ అంచనాలను ఈ సినిమా చేరుకుంటుంది అంటూ ఈ సందర్భంగా రష్మిక పుష్ప సీక్వెల్ సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె ఇటీవల బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ తో కలిసి నటించిన యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…