Jeevitha: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటి జీవిత ఒకరు. ఈమె ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక హీరో రాజశేఖర్ తో కలిసి పలు సినిమాలలో నటించిన జీవిత ఆ సినిమాల సమయంలోనే తనతో ప్రేమలో పడి అనంతరం పెళ్లి చేసుకున్నారు.
ఇక పెళ్లి తర్వాత జీవిత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇలా ఈమె సినిమాలకు దూరం కావడానికి గల కారణం ఏంటి అనే విషయాలను ఇటీవల వెల్లడించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జీవిత ఈ విషయాల గురించి మాట్లాడుతూ.. తాను రాజశేఖర్ గారిని ప్రేమించాను అనే విషయం మా ఇంట్లో చెప్పడంతో మా ఇంట్లో వారు వెంటనే పెళ్లి ఒప్పుకున్నారు కానీ రాజశేఖర్ ఇంట్లో మా పెళ్ళికి ఒప్పుకోలేదని తెలిపారు.
ఆస్తులు అంతస్తుల విషయంలో మాకంటే రాజశేఖర్ కుటుంబం మంచి స్థాయిలో ఉంది అందుకే తన ఇంట్లో నన్ను కోడలుగా చేసుకోవడానికి అంగీకరించలేదని తెలిపారు. అయితే ఆయన ఇంట్లో వాళ్ళందరిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు ఇక పెళ్లి తర్వాత నేను ఆ ఇంట్లో ఒక మంచి కోడలు అని గుర్తింపు సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో సినిమాలకు దూరంగా అవ్వాలని భావించాను.
మంచి కోడలు కావడం..
ఇక ఇదే విషయాన్ని నేను రాజశేఖర్ తో చెప్పడంతో ఆయన కూడా నీ ఇష్టం అన్నారు అందుకే తాను సినిమాలపై ఆసక్తి చూపకుండా తన కుటుంబ బాధ్యతలపై ఆసక్తి చూపించానని అలా సినిమాలకు పెళ్లి తర్వాత దూరం కావాల్సి వచ్చింది అంటూ ఈ సందర్భంగా జీవిత రాజశేఖర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె హీరోయిన్గా దూరమైనప్పటికీ నిర్మాతగాను డైరెక్టర్ గాను కొనసాగుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…