Rashmika: నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో మరోవైపు సినిమా షూటింగులతో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా మారిపోయారు. ఇలా ఎంతో చలాకిగా ఉండే రష్మిక డాక్టర్ వద్దకు వెళ్లిందని తెలియగానే అసలు ఆమెకు ఏం జరిగింది అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈమె హైదరాబాద్లోనే ఆర్థోపెడిక్ గురువారెడ్డిని సంప్రదించినట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే గురువారెడ్డి సోషల్ మీడియా వేదికగా రష్మిక తన వద్దకు చికిత్స కోసం వెళ్ళినట్టు తెలియజేశారు.అయితే ఎవరు కంగారు పడాల్సిన పనిలేదని ఆమె గత కొద్ది రోజులుగా మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడటం వల్ల చికిత్స కోసం తన వద్దకు వచ్చిందని ఈయన తెలియజేశారు.
రష్మిక సామి సామి అంటూ డాన్స్ చేస్తూ బరువు మొత్తం మోకాలి పై వేయటం వల్ల ఇలా నొప్పులు వచ్చాయి. అంటూ నా దగ్గరకు వచ్చిన శ్రీవల్లికి సరదాగా పెద్దవి విరుస్తూ ఇలా అన్నాను. పుష్ప సినిమా చూసిన తర్వాత ప్రత్యేకంగా మిమ్మల్ని కలిసి అభినందించాలనుకున్నాను అయితే మోకాలి నొప్పి ద్వారా నన్ను కలిసే సందర్భం వచ్చిందని డాక్టర్ ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఇలా రష్మిక మోకాళ్ళ నొప్పుల గురించి ఈయన తన ఫేస్ బుక్ స్టోరీ ద్వారా షేర్ చేయడమే కాకుండా త్వరలోనే అల్లు అర్జున్ కూడా తన వద్దకు వస్తాడేమో తనకు కూడా భుజం నొప్పిగా ఉందంటూ వస్తాడేమోనని ఈ సందర్భంగా డాక్టర్ గురువారెడ్డి ఫేస్ బుక్ స్టోరీ ద్వారా ఈ విషయాన్ని తెలియజేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…