Producer Ravindar: గత కొద్ది రోజులుగా కోలీవుడ్ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ నటి మహాలక్ష్మి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం మనకు తెలిసిందే.వీరిద్దరూ పెళ్లి చేసుకోవడంతో వీరు పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ కావడంతో వీరి పెళ్లిపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అధిక శరీర బరువు ఉన్నటువంటి రవీందర్ ను కుందనపు బొమ్మలా ఉన్నటువంటి మహాలక్ష్మి పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అని సందేహాలు వ్యక్తం చేశారు.
ఇలా రవీందర్ ను మహాలక్ష్మి పెళ్లి చేసుకున్నది కేవలం డబ్బు కోసమే అంటూ పెద్ద ఎత్తున చాలామంది ఈమెను తప్పుపట్టారు.ఇలా తమ పెళ్లి గురించి వార్తలు రావడంతో ఈ వార్తలపై స్పందించిన రవీందర్ తను డబ్బు మనిషి కాదని నా మనసు చూసి తను నన్ను పెళ్లి చేసుకుంది అంటూ ఆ వార్తలను కొట్టి పారేశారు. ఇక వివాహం తర్వాత ఈ జంట హనీమూన్ కి వెళ్ళగా హనీమూన్ ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా వీరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రవీందర్ తన భార్య మహాలక్ష్మికి భారీగా బంగారం కొనిచ్చారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈయన మహాలక్ష్మికి ఏకంగా బంగారు పూత పూసిన మంచంతో పాటు కేజిన్నర బంగారు నగలను కూడా కొనిచ్చారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఈ విధంగా వీరిద్దరి గురించి ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజెన్లు ఎట్టకేలకు నటి మహాలక్ష్మి కోరుకున్నదే జరుగుతుంది ఆమె కేవలం అతని డబ్బు చూసే తనని పెళ్లి చేస్తుందని తనపై ఎలాంటి ప్రేమలు లేవంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.ఇలా పెళ్లయిందో లేదో అప్పుడే అతని చేత భారీగా బంగారు నగలు కొనిపెట్టించుకుంది మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ వ్యాఖ్యలపై మరికొందరు స్పందిస్తూ భార్యకు బంగారు కొని ఇవ్వడంలో తప్పేముంది అంటూ సమర్పిస్తున్నారు. మొత్తానికి ఈమెకు బంగారం కొనిచ్చిన విషయం ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…