Categories: FeaturedMovie News

Anchor Syamala: పెళ్లికూతురుల ముస్తాబయి పల్లకిలో ఊరేగిన శ్యామల.. భారీగా ట్రోల్ చేస్తున్న నేటిజన్స్!

Anchor Syamala: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ శ్యామల గురించి పరిచయం అవసరం లేదు. బుల్లితెర యాంకర్ గా టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ కు దూరమైనప్పటికీ యాంకర్ గా పలు సినిమా ఈవెంట్లకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతున్న ఈమె బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇకపోతే ఈమె ఏం చెప్పారు శ్యామల గారు అనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. తనకు యూట్యూబ్లో ఏకంగా ఒక మిలియన్ కి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు.

ఇలా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే శ్యామల నిత్యం తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా అచ్చం పెళ్లి కూతురిగా ముస్తాబయి పెద్ద ఎత్తున ఊరేగింపుగా వచ్చినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Anchor Syamala: పెళ్లిలో తీరని కోరికను ఇలా తీర్చుకున్న శ్యామల..

ఈ వీడియోలో భాగంగా ఈమె పెళ్లికూతురుల అందంగా రెడీ కావడమే కాకుండా నలుగురు మనుషులు తనని పల్లకిలో మోసుకుంటూ వచ్చారు. అయితే అక్కడికి జనాలు రాకుండా భారీ కేడ్ లు నిర్వహించి పోలీసులకు కూడా బందోబస్తుకు వచ్చారు.అయితే తన పెళ్లిలో ఇలాగా అందంగా తయారవ్వాలని ఈమె కోరుకుందట కానీ తను నటుడు నరసింహారెడ్డిని ప్రేమ వివాహం చేసుకోవడంతో తన కోరిక తీరలేదని అయితే నేడు ఈ కోరిక తీరింది అంటూ ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోని షేర్ చేయడంతో ఈ వీడియో పై పలువురు నెటిజెన్లు స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేయడమే కాకుండా ఇప్పుడు ఇది అవసరమా అంటూ మరికొందరు ఈమెను ట్రోల్ చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago